కరోనా మహమ్మారి కారణంగా జిమ్స్ మూతబడ్డాయి, మారథాన్లు మూగబోయాయి, రన్నింగ్ ట్రాక్‌లు వెలవెలబోతున్నాయి. మొత్తంగా ఒంటికి చెమటపట్టించే కసరత్తులు కరువయ్యాయి. అయినా, ఆన్లైన్ వేదికగా వర్చువల్ మారథాన్లు వస్తున్నాయి. మీరు ఎక్కడున్నా సరే. యాప్‌కు అనుసంధానమై వర్చువల్ రన్ చేయవచ్చు. వాక్/జాగ్/సైక్లింగ్ ఏదైనా ఫర్వాలేదు. మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు రన్లో పాల్గొనవచ్చు. విజేతకు పతకం కూడా కొరియర్లోనే పంపుతారు. మీరు చేయాల్సిందల్లా ఒకటే. ఆన్లైన్లో జరిగే మారథాన్లలో మీ పేరును నమోదు చేసుకోవడమే.