కావలసిన పదార్థాలు
ఓట్స్ పిండి: ఒక కప్పు, నూనె: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: తగినంత.
తయారీ విధానం
ముందుగా స్టవ్‌మీద అర కప్పు నీళ్లు వేడిచేసి దాంట్లో నూనె, తగినంత ఉప్పు జోడించి.. ఓట్స్ పిండి వేసి బాగా కలిపి మూతపెట్టి పది నిమిషాల పాటు పక్కనపెట్టాలి. పిండిని ప్లేట్లోకి తీసుకుని బాగా మెదిపి, చిన్నచిన్న ఉండలు చేసుకుని చపాతీల్లా ఒత్తుకోవాలి. పెనం వేడయ్యాక, ఆ చపాతీలను రెండు వైపులా కాల్చుకుంటే, ఆరోగ్యకరమైన ఓట్స్ రొట్టెలు సిద్ధం. ఇవి ఏ కూరతో అయినా బాగుంటాయి.