లెదర్ కాదిది.. వీగన్ లవర్!

లెదర్‌తో తయారైన బ్యాగ్‌లు, బూట్లు, పర్సులు, బెల్టులంటే జనాల్లో క్రేజే వేరు. కానీ లెదర్ తయారీకి ఏటా కొన్ని లక్షల జంతువులు బలవుతున్నాయి. మూగ జీవాలను బాధించకుండా, పర్యావరణానికి ఎలాంటి హానీ జరగకుండా లెదర్ తయారవుతున్నదిప్పుడు. దీనినే ‘వీగన్ లెదర్' అని పిలుస్తున్నారు. వీగనిజాన్ని ఫాలో అవుతున్నవారి కోసం ఈ కొత్తరకం చర్మాన్ని సృష్టించారు. జంతువులతో సంబంధం లేకుండా వివిధరకాల వ్యర్థాలతో దీన్ని అభివృద్ధి చేశారు. వీగన్ లెదర్‌తో తయారైన దుస్తులు కూడా అందుబాటులోకి వచ్చాయి. రకరకాల చెట్ల ఆకులు, పూలు, పండ్లు, కాండాలతో వీగన్ లెదర్‌ను తీర్చిదిద్దుతున్నారు పరిశోధకులు. పైనాపిల్ తొక్క, ఓక్ చెట్ల బెరడు, వైన్ తయారీలో మిగిలిపోయిన వ్యర్థాలు, పుట్టగొడుగులు, కొబ్బరి వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహార పదార్థాలతో దీన్ని సృష్టించారు.
మనదేశంలోనూ బ్రోకోమేట్, ది ఆల్టర్నేట్, హ్యాపీ సోల్, అకిలెస్ హీల్స్ తదితర సంస్థలు మొక్కల నుంచి తీసే సింథటిక్‌తో వీగన్ లెదర్‌ను తయారు చేస్తున్నాయి. వీటికి ప్రముఖుల అండ కూడా లభిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాషన్ డిజైనర్లు వీగన్ లెదర్‌తో జాకెట్లు, బూట్లు, బ్యాగులను రూపొందిస్తున్నారు. హాలీవుడ్ సెలబ్రిటీలైన ఎమ్మా వాట్సన్, మేఘన్ మార్కెల్, గాయని మిల్లే సైరస్ వంటివారు వీగన్ లెదర్‌కు ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ఈమధ్యే వీగన్లెదర్ ఫ్యాషన్ వీక్‌ను నిర్వహించారు. అంతేకాదు, మల్టీబ్రాండ్ వీగన్ ఫ్యాషన్ లైబ్రరీనీ ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి వీగన్ లెదర్ షోరూమ్.
తాజావార్తలు
- ఎమ్మెల్సీగా రాంచందర్‌రావు ఏంచేశారు?
- ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు ఉంటయా?
- రుణ యాప్‌ల దోపిడీ 20 వేల కోట్లు
- లెక్కతప్పని తేలిస్తే ముక్కు నేలకురాస్తా
- నారసింహుడి ఆలయం నల్లరాతి సోయగం
- తాప్సీ ఇంటిలో ఐటీ సోదాలు
- ప్రభుత్వం.. ఉద్యోగులది పేగుబంధం
- రాజకీయాలకు శశికళ గుడ్‌బై
- సేవ చేస్తే శిక్ష రద్దు
- టీటా రాష్ట్ర కార్యదర్శిగా వెంకట్ వనం