పని, పని, పని.. మనుషుల జీవితాల్ని పనే ఆక్రమిస్తున్నది. వెనక్కి తిరిగి చూసుకుంటే క్లయింట్లకు చేసి పెట్టిన ప్రాజెక్టులు, యజమానికి సమర్పించిన నివేదికలు, కస్టమర్లకు చేసిన సేవలు తప్పించి మరో జ్ఞాపకం ఉండటం లేదు. చేసిన కొద్దీ పనిలో వేగం పెరుగుతుందనీ, నైపుణ్యం మెరుగు పడుతుందనీ మురిసి పోనవసరం లేదు. ఇదంతా నిన్నటి మాట. తాజాగా శాస్త్రవేత్తలు పనిలో బ్రేక్ అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. వారానికో రోజు, నెలకో నాలుగు రోజులు, ఏడాదికో పక్షం రోజులు.. ఇలా విరామం తీసుకుంటే మెదడుకు చురుకుదనం అధికమవుతుందని ఆక్స్ఫర్డ్ పరిశోధకులు అంటున్నారు.