ఫ్యాషన్ ప్రపంచం కొత్తపుంతలు తొక్కుతూ ఉంటుంది. ఏ రోజు ఏ ైస్టెల్ ట్రెండ్‌గా మారుతుందో చెప్పడం అసాధ్యం. ముఖ్యంగా యాక్సెసరీస్ విషయంలో రోజుకో రకం హల్చల్ చేస్తుంటుంది. అయితే, కొన్నేండ్ల క్రితం ఫ్యాషన్ ఐకాన్‌గా మారిన టర్బన్ హెడ్‌బ్యాండ్ ఇప్పుడు మళ్లీ హవా మొదలుపెట్టింది. మార్కెట్లో రకరకాల టర్బన్ హెడ్బ్యాండ్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్ని సంప్రదాయ తలపాగాలను తలపిస్తే, కొన్ని సాధారణ హెయిర్బ్యాండ్లా సన్నగా ఉంటున్నాయి. వీటికి చిన్నపిల్లలే కాదు, టీనేజ్ గాళ్స్ నుంచి ఆఫీస్ మహిళల వరకు.. అందరూ ఆదరిస్తున్నారు. డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేలా ప్రత్యేకించి కుట్టించుకుంటున్నారు కూడా. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ ఎగ్జిబిషన్లో ఫ్యాషన్ లేబుల్స్ టర్బన్ హెడ్బ్యాండ్స్ని హైలెట్ చేశాయి. వీటిలో పెయింటెడ్, ఎంబ్రాయిడరీ బ్యాండ్లూ ఉన్నాయి.