e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home జిందగీ మదగజ గమనా..

మదగజ గమనా..

వనసీమలో బెదురు లేనిది, చదరంగంలో ఎదురు లేనిది, రణరంగంలో తిరుగు లేనిది ఏనుగు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటారు. ఇన్ని ప్రత్యేకతలున్న మత్తేభానికి ఆభరణాల్లోనూ పెద్దపీట వేశారు మన పూర్వికులు. మంజీరాలు మొదలు భుజకీర్తుల వరకు అన్నిటా కుంజరాలను రాజసంగా ప్రతిష్ఠించేవారు. ఇప్పుడు గజరాజు దంతాలతో చేసిన ఆభరణాలూ ఫ్యాషన్‌ ప్రపంచాన్ని ఏలుతున్నాయి.

మదగజ గమనా..

ఏనుగు నల్లనైతేనేం! ఏనుగు కొమ్ములు తెల్లన. ఆ దంతాలతో వన్నెచిన్నెల ఆభరణాలు తయారవుతున్నాయి. కాకపోతే, చాలా సందర్భాల్లో ఏనుగు దంతాల స్థానంలో ఫైబర్‌ ఉపయోగిస్తున్నారు. ఆ లోటు తెలియకుండా తగిన జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. తెలుపు, గోధుమ కలిసిన ప్రత్యేకమైన రంగులో ఉండే ఈ నగలు అన్ని రకాల దుస్తులపైనా అందంగా అమరిపోతాయి. అందుకే, రోజురోజుకూ మార్కెట్లో కొత్తకొత్త డిజైన్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వీటిని ధరించడం ఓ అదృష్టంగానూ భావిస్తారు.

సంప్రదాయంగా..
ఈ కాలం దుస్తులకు నప్పేలా చిత్రవిచిత్రాకృతుల్లో కరిదంత ఆభరణాలు తయారవుతున్నాయి. సంప్రదాయవస్త్రశ్రేణికి తగ్గట్టుగా హారాలు, నెక్లెస్‌లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, ఏనుగు దంతం గాజులు మరీ ప్రత్యేకం. వీటిపై అద్దకాలు ముచ్చట గొలిపేలా ఉంటాయి. దంతపు బీడ్స్‌ని పచ్చలు, పగడాలతో కలిపి పొడవైన దండలుగా మలుస్తున్నారు తయారీదారులు.

మదగజ గమనా..

ఆపాదమస్తకం
ర్యాంప్‌షో దుస్తులపైనా ఇవి ఒదిగి పోతున్నాయి. ఇక, అలంకరణ ప్రియులకోసం రకరకాల పూలు, జంతువులు, అక్షరాలు, పేర్లతో కూడిన డిజైన్లతో ఉంగరాలు, బ్రేస్‌లెట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక దుస్తులకు నప్పేలా చిన్న పెండెంట్లు, సన్నటి
గొలుసులు దొరుకుతున్నాయి. ఆత్మీయుల చిత్రాలనూ జోడించి ధరించవచ్చు. పూసలు, దుద్దులు, హారాలు, పట్టీలుకూడా తయారవుతున్నాయి. వీటి మెరుపు, వన్నె ఎప్పటికీ తగ్గదు. ఒకసారి నీటితో శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి ధరిస్తే చాలు. కానీ, ఈ నగలను మిగతా ఆభరణాలతో కలిపి భద్రపరచొద్దు. లోహపు నగలవల్ల వీటిపై గీతలు పడే అవకాశం ఉంటుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మదగజ గమనా..

ట్రెండింగ్‌

Advertisement