గర్భధారణ, బరువు తదితర విషయాలనే కాదు, జుట్టు ఆరోగ్యాన్ని కూడా హార్మోన్లు నిర్ణయిస్తాయి.అరవై అయిదేండ్లు దాటిన వారిలో సగానికి సగం మంది తమకు జుట్టు బాగా ఊడిపోతోందని బాధపడి పోతుంటారు. వృద్ధాప్య లక్షణాలలో ఇదొకటి.ఇతర అనారోగ్యాలు కూడా ఓ కారణమే. థైరాయిడ్ సమస్య, ఆర్థరైటిస్, సికిల్-సెల్ ఎనీమియావంటివి కూడా జుట్టు ఊడి పోవడానికి ఓ కారణమే.పోషక విలువల లోపాన్నీ తేలిగ్గా తీసుకోలేం. ముఖ్యంగా ‘విటమిన్-బి12’ తగ్గితే జుట్టుబలహీనమవుతుంది.క్యారెట్, గుమ్మడి విత్తనాలు, పాలకూర వంటివాటిలో బీటా కెరోటిన్స్ పుష్కలం. ఇవన్నీ ‘విటమిన్-ఎ’గా మారి రక్షణనిస్తాయి. ఆల్మండ్స్, మాంసం, చేపలు, ఆకుకూరలు మొదలైన వాటితో ‘విటమిన్-బి’ని పొందవచ్చు. యోగా, ధ్యానం, సంగీతం ఒత్తిడిని తగ్గిస్తాయి. అవసరమైతే హార్మోన్ థెరపీకూడా చేయించుకోవచ్చు.