ఇంట్లోనే ఉంటూ ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? మంచి బిజినెస్ ఐడియా ఉన్నా డబ్బు సమకూరడం లేదా? అయితే, మీలాంటి గృహిణులకు ‘బ్రిటానియా మారీగోల్డ్’ ఓ మంచి అవకాశాన్ని ఇస్తున్నది. ‘మారీగోల్డ్ మై స్టార్టప్ సీజన్ 3.0’ లో భాగంగా రూ.10 లక్షల పెట్టుబడి అందిస్తుంది. అంతేకాదు, శిక్షణ కూడా ఇస్తుంది. ఆసక్తి ఉన్న మహిళలు www.britanniamystartup.com వెబ్సైట్లో వివరాలు, వ్యాపార ఆలోచనలు నమోదు చేసుకోవచ్చు. ‘ప్రతి మహిళలోనూ అపారమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వాటికి వ్యాపార కోణాన్ని జోడిస్తే అద్భుతాలు సాధించగలరు’ అంటారు బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు వినయ్ సుబ్రహ్మణ్యం, గూగుల్ ఇండియా ఆగ్నేయ ఆసియా సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్ సప్నా చడ్డా.