ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Zindagi - Jan 25, 2021 , 02:12:09

డైరెక్షన్‌ మార్చేస్తాం!

డైరెక్షన్‌ మార్చేస్తాం!

బాలీవుడ్‌.. టాలీవుడ్‌.. ఎందులో చూసినా మహిళా డైరెక్టర్లు చాలా తక్కువ శాతమే ఉంటారు. అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా పనిచేస్తున్న మహిళలు, దర్శకత్వ శాఖలో మాత్రం ఎందుకు ఇంత తక్కువగా ఉన్నారు? ఈ అసమానత్వానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు ముందుకొచ్చారు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్లు.. ఏక్తా కపూర్‌, గునీత్‌ మోంగా, రైటర్‌ - డైరెక్టర్‌ తహీరా కశ్యప్‌.

 ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో భారతీయ మహిళల సంఖ్యను పెంచేందుకు ‘ఇండియన్‌ ఉమెన్‌ రైజింగ్‌' పేరుతో ఒక బృందాన్ని తయారు చేసినట్లు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటించారు  ఏక్తా కపూర్‌, గునీత్‌ మోంగా, తహీరా కశ్యప్‌. 

ప్రతిభను ప్రోత్సహిస్తాం..

భారతీయ మహిళల్లో చాలామందికి సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలని ఉంటుంది. కెమెరా ముందు కనిపించే యాక్టర్స్‌గానే కాకుండా, తెర వెనుక డైరెక్షన్‌లోనూ రాణించాలని కలలు కంటుంటారు. అలాంటి వాళ్లను ప్రోత్సహించేందుకు.. మేమున్నామంటూ హామీ ఇస్తున్నది ఇండియన్‌ ఉమెన్‌ రైజింగ్‌ టీమ్‌. “ఒకేలా ఆలోచించేవాళ్లను కలుసుకోవడం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. నాలానే స్పందించే మోంగా, కశ్యప్‌ నన్ను కలిసినప్పుడు చాలా గర్వంగా అనిపించింది. ఆడవాళ్లకు సరైన అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తే, కచ్చితంగా అద్భుతాలు సాధిస్తారని నేనెప్పుడూ బలంగా నమ్ముతాను’ అంటున్నారు ఏక్తాకపూర్‌. టాలెంట్‌ ఉన్న మహిళలు మంచి కథలతో ముందుకొస్తే డైరెక్టర్‌గా అవకాశం ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇస్తున్నారు కపూర్‌ అండ్‌ టీమ్‌. భారతీయ సినిమా పరిశ్రమలో  మహిళా డైరెక్టర్లు ఐదు శాతమే ఉన్నారు. ఇంకా తొంభై అయిదు శాతం జాగా మిగిలే ఉంది. అటువైపుగానే ఈ ఆడసైన్యం దండయాత్ర. 

VIDEOS

logo