గురువారం 04 మార్చి 2021
Zindagi - Feb 18, 2021 , 00:22:22

కూచిపూడి రాణెమ్మ!

కూచిపూడి రాణెమ్మ!

సంధ్యారాజు.. ‘నాట్యం’ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన కూచిపూడి నర్తకిగానే చాలామందికి తెలుసు. తను ప్రముఖ వ్యాపారవేత్త, రామ్‌కో గ్రూప్‌ చైర్మన్‌ పి.ఆర్‌. వెంకట్రామ రాజా కుమార్తె. సత్యం కంప్యూటర్స్‌ వ్యవస్థాపకులు రామలింగరాజు చిన్న కోడలు. వెంపటి చినసత్యం శిష్యురాలు. ఆమె ‘కృష్ణ శబ్దం’ వీడియో యూట్యూబ్‌లో పదిలక్షల వ్యూస్‌ సాధించింది. ఓ సంప్రదాయ నృత్యానికి సంబంధించిన వీడియోకు అన్ని వ్యూస్‌ రావడం గొప్ప విషయమే. సంధ్య మోడల్‌ కూడా. టాలీవుడ్‌లో కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పనిచేశారు. దర్శకుడు రేవంత్‌ కోరుకొండ దర్శకత్వంలో వచ్చిన ‘నాట్యం’ అనే సినిమాలో సంధ్య ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాదు ఈ సినిమాకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా, ైస్టెలిస్ట్‌గా, కొరియోగ్రాఫర్‌గా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆన్‌లైన్‌లో వైద్య సేవలను అందించే ‘కాల్‌హెల్త్‌' సంస్థను కూడా స్థాపించారు. 

VIDEOS

logo