శనివారం 28 నవంబర్ 2020
Zindagi - Nov 22, 2020 , 00:17:08

ప్రపంచంతో ప్రేమలో..

ప్రపంచంతో ప్రేమలో..

ఆమె ఏకంగా ప్రపంచంతోనే ప్రేమలో పడ్డది. జగమంతా చూసి రావాలని ఆకాంక్షించింది. ఒకటికాదు.. రెండుకాదు.. భూమండలంపై ఉన్న అన్ని ఖండాలనూ చుట్టేయాలని కలగన్నది. అంతే, బ్యాగు తీసుకొని బయల్దేరింది. మూడున్నర రోజుల్లోనే ప్రపంచం మొత్తాన్నీ చుట్టేసింది. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లోనూ చోటు దక్కించుకున్నది. 

యూఏఈకి చెందిన డాక్టర్‌ ఖవ్లా అల్‌ రోమైతి, అత్యంత వేగంగా ఏడు ఖండాలనూ చుట్టివచ్చి ప్రపంచ రికార్డు సృష్టించింది. మూడు రోజుల, 14 గంటల,  46 నిమిషాల్లోనే ప్రపంచ ప్రదక్షిణ చేసి వచ్చింది. విమానాలు ఎక్కుతూ దిగుతూ.. 87 గంటల్లో 208 దేశాలను సందర్శించింది. 2020 ఫిబ్రవరి 13న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తన ప్రయాణాన్ని ముగించింది. నవంబర్‌ 18న గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల దినోత్సవం సందర్భంగా, తనకు ప్రపంచ రికార్డులో చోటు దక్కింది. ‘చాలా సందర్భాల్లో మధ్యలోనే ఇంటికి తిరిగి రావాలని అనుకున్నాను. అంతలోనే లక్ష్యం గుర్తుకొచ్చేది. నన్ను ప్రోత్సహించిన కుటుంబానికి, స్నేహితులకు కృతజ్ఞతలు’ అంటున్నది ఖవ్లా. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం ఆనందంగా  ఉందని  కూడా చెబుతున్నది. ‘నేను ప్రపంచంతో ప్రేమలో పడ్డాను. ఇదో రకమైన ప్రేమయాత్ర’ అంటున్నదా అమ్మాయి.