Advice | నా వయసు ఇరవై ఆరు. సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. కాకపోతే నేనింకా ఎక్కువ శ్రద్ధగా చదవాలేమో, సరిగ్గా ప్రిపేర్ కావడంలేదేమో అన్న ఆందోళన నాలో పెరుగుతున్నది. అమ్మానాన్నలు పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ నాకు స్వతంత్రంగా బతకాలని ఉంది. అప్పుడే పెండ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆ మాట గట్టిగా చెప్పలేకపోతున్నాను. ఈ ఆలోచనలతో సరిగా భోజనం చేయలేకపోతున్నాను. రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు. నేను ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు తగిన సలహా ఇవ్వండి.
– ఓ సోదరి
జ: మానసిక ఒత్తిడి, ఆలోచనల్లో గందరగోళం, మీ తరఫున మీరు గట్టిగా మాట్లాడలేకపోవడం.. మొదలైనవన్నీ మీలో ఆత్మన్యూనతకు సంకేతాలు. అలాగే మీరు తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారు. ఒత్తిళ్లు, అర్థంలేని ఆలోచనలు, రక్తపోటు, ఆకలి లేకపోవడం, నిద్రలేమి.. మొదలైనవన్నీ ఆ లక్షణాలే. చెమట పట్టడం, గుండె దడ, వణుకు, తల తిరగడం.. వంటి సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి. ముందు మీరు మనసును అదుపులో పెట్టుకోండి. ఇప్పటివరకు సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. దీనివల్ల ఆత్మ విశ్వాసం రెట్టింపు అవుతుంది. అలాగే అద్దం ముందు నిల్చొని, ‘నేను బాగా చేయగలను. నాకు ఆ నమ్మకం ఉంది’ అని పదేపదే మనసుకు సంకేతాలు పంపుకోవాలి. మీలో ఆత్మ ైస్థెర్యం పెరిగాక అమ్మా
నాన్నలతో మాట్లాడండి. మీ లక్ష్యం గురించి, పెండ్లి వాయిదా గురించి నెమ్మదిగా చర్చించండి. రెండు వారాల తర్వాత కూడా మీలో ఎలాంటి మార్పూ రాకపోతే, కౌన్సెలర్‌ని సంప్రదించి థెరపీ తీసుకోవడం ఉత్తమం.
– సహానా రబీంద్రనాథ్, లైఫ్ కోచ్ అండ్ థెరపిస్ట్ SWITCH NOV, హైదరాబాద్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆ విషయంపై నాకు, మావారికీ అవగాహన లేదు.. ఐదేండ్లు అయినా పిల్లలు పుట్టలేదు
అమ్మను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు.. నరకం చూపిస్తున్నాడు.. ఏం చేయాలో చెప్పండి
ఆ విషయం ఇంట్లో తెలియకూడదు.. నా వల్ల అమ్మనాన్న తలదించుకోవద్దు
మా అబ్బాయి వింతగా ప్రవర్తిస్తున్నాడు.. ఏం చేయాలో అర్థం కావట్లేదు
ఆ అబ్బాయితో నా చెల్లి పెండ్లి జరిగితే కాపురం సాఫీగా సాగుతుందా?
ఏడు నెలల క్రితం సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నా.. నా భర్త ఈ మధ్యే చనిపోయాడు.. నేనేం చేయాలి?