సోమవారం 01 మార్చి 2021
Zindagi - Feb 03, 2021 , 01:08:35

ట్రోలింగ్‌ పట్టించుకోను!

ట్రోలింగ్‌ పట్టించుకోను!

సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ గురించి పట్టించుకోనంటున్నది బాలీవుడ్‌ భామ దియామీర్జా. ‘సమాజంలో రోజురోజుకూ పరిస్థితులు మారుతున్నాయి. చిత్ర పరిశ్రమలోనూ అంతే. ఒకప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఇదివరకు సినిమా ప్రమోషన్స్‌ అంటే చాలా తతంగం ఉండేది. కానీ ఇప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులు చాలా దగ్గరగా ఉంటున్నారు’ అంటూ బాలీవుడ్‌లో వచ్చిన మార్పుల గురించి చెప్పుకొచ్చింది దియా. ‘సోషల్‌ మీడియా ఓ చక్కని వేదిక. ఎన్నో విషయాలను పంచుకోవచ్చు. కానీ చిన్నచిన్న విషయాలకు కూడా ట్రోలింగ్‌ చేస్తూ ఇబ్బంది పెట్టడం కొందరికి అలవాటుగా మారింది. నా మీద కూడా చాలా ట్రోల్స్‌ వచ్చాయి. నేనెప్పుడూ వాటిని చూసి బాధ పడలేదు. ఎందుకంటే, మనం చేస్తున్న పని సరైంది అయితే చాలు. మనల్ని మనం నమ్మితే చాలు. బాధ్యత లేకుండా దూషించేవారిని పట్టించుకోవాల్సిన పన్లేదు’ అంటున్నది దియా.


VIDEOS

logo