పెండ్లిళ్లు, పండుగల వంటి వేడుకల్లో సంప్రదాయ దుస్తులదే హవా. ఈ ట్రెండ్‌కు ఆధునిక సొబగులు అద్దుతున్నాయి లెహంగాలు. గుబురుగా జాలు వారే పొడవాటి లెహంగాలే ప్రస్తుత ట్రెండ్. నిండైన రఫుల్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించడం వీటి ప్రత్యేకత. ఫంక్షన్ అయినా, పార్టీ అయినా సంప్రదాయంతో పాటు ట్రెండింగ్ లుక్‌ను ఇచ్చే లెహంగా డిజైన్లేంటో చూద్దాం.
ఓహో గులాబి బాల
అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే లైట్ పింక్ కలర్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన లెహంగా ఇది. దీనిపై త్రెడ్ వర్క్ చేసిన ఎరుపు రంగు గులాబీలు ముచ్చటగా ఉన్నాయి. సీక్వెన్స్‌గా ఇచ్చిన లైన్లు లెహంగాను హైలైట్ చేస్తున్నాయి. అదే ఫ్యాబ్రిక్‌తో జత చేసిన బ్లౌజ్ అదనపు ఆకర్షణ. నార్మల్ బ్లౌజ్లా ఇచ్చినా డోరీ పైపింగ్‌తో హైలైట్ చేశారు. బ్లౌజ్పైనా గులాబీల వర్క్ చూడముచ్చటగా ఉంది. లెహంగాకు కాంట్రాస్టింగ్‌గా ఇచ్చిన పిస్తాగ్రీన్ కలర్ కట్‌వర్క్ దుపట్టా చక్కగా కుదిరింది.
మోడల్: రితీషా రెడ్డి
నీలాల మణి
లైట్ బ్లూ కలర్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్‌పై సిల్వర్ ఫాయిల్ ప్రింట్‌తో రూపొందించిన లెహంగా ఇది. బార్డర్ పార్ట్‌లో ప్రింటెడ్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్‌తో ఇచ్చిన రఫుల్స్ మరింత అందాన్నిచ్చాయి. లెహంగాకి నప్పేలా అదే ఫ్యాబ్రిక్‌తో హైనెక్ బ్లౌజ్ డిజైన్ చేశారు. మెడ చుట్టూ ఆర్గాంజా ఫ్యాబ్రిక్‌తో ఇచ్చిన ఫ్లీడ్స్ ట్రెండీగా ఉన్నాయి. పఫ్ ైస్టెల్లో ఎల్బో వరకు ఇచ్చిన హ్యాండ్స్ చక్కగా కుదిరాయి. ఈ నీలాల మణిపైకి సిల్వర్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్‌పై రఫుల్స్‌తో తీర్చిదిద్దిన దుపట్టా భలేగా సెట్ అయింది.
మోడల్: చైత్రా రాయ్
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్, follow us on: instagram.com/
riteshareddy, 70136 39335