ఓ వ్యక్తి నన్ను తీవ్రంగా వేధిస్తున్నాడు. అప్పుడప్పుడు భౌతికంగానూ ఇబ్బంది పెడుతున్నాడు. చాలాకాలం పాటు భరించాను. ఇక ఓర్చుకోలేక పోతున్నాను. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ఐపీసీ 354 కింద కేసు ఫైల్ చేయడానికి కాలపరిమితి ఉంటుందా? కేసు ఎలా ఫైల్ చేయాలి? … ఓ సోదరి
జ : పోలీస్ కంప్లెయింట్ ఫైల్ చేయడానికి ఎలాంటి కాల పరిమితి ఉండదు. నిజానికి సంఘటన జరిగినప్పుడు, వీలైనంత త్వరగా పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాలి. అలా చేసినప్పుడే పోలీసులు త్వరగా యాక్షన్ తీసుకోవడానికి వీలుంటుంది. అలా కాకుండా ఇప్పటికే ఆలస్యమైనా సరే, త్వరగా వెళ్లి ఫిర్యాదు ఇవ్వండి. ఆలస్యానికి కారణాలను కూడా వాళ్లు రాసుకుంటారు. పోలీస్ కంప్లెయింట్ ఫైల్ చేయడం దగ్గర్నించి మిగతా వివరాలన్నీ మా వెబ్సైట్ ద్వారాకూడా తెలుసుకోవచ్చు.
మానసి చౌదరి
అడ్వకేట్
www.pinklegal.in