రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగాలని డాక్టర్లు చెబుతుంటారు. కానీ, మనలో ఓ సందేహం? నాలుగైదు అంటే.. నాలుగు లీటర్లా, నాలుగున్నర లీటర్లా, ఐదు లీటర్లా? తాజాగా ఓ నిపుణుల బృందం శరీరానికి అవసరమైన నీటి పరిమాణాన్ని లెక్కగట్టింది. మనిషి బరువును బట్టి ఆ కొలత కొంత మారుతుందని కూడా చెప్పింది. ఉదాహరణకు మీ బరువు డబ్భు కిలోలు అయితే, దాన్ని ముందుగా పౌండ్లలోకి మార్చుకోవాలి. అంటే, 70 ఇంటూ 2.2= 154. ఆతర్వాత, పౌండుకు 30 మిల్లీ లీటర్ల చొప్పున 154 ఇంటూ 30 మి.లీ = 4620 మి.లీ. (లేదా 4.62 లీటర్లు). ఇంతకంటే కొంత ఎక్కువ తాగినా నష్టమేం ఉండదు. కానీ తక్కువ తాగకూడదు.