కావలసిన పదార్థాలు: మొలకెత్తిన పెసలు, శనగలు, బొబ్బర్లు: ఒక కప్పు, పల్లీలు: పావుకప్పు, డ్రై ఫ్రూట్స్: పావుకప్పు, మిరియాలపొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, నిమ్మరసం: రెండు టీస్పూన్లు, కొత్తిమీర తరుగు: ఒక టీస్పూన్, ఉల్లిపాయ: ఒకటి
ఒక గిన్నె తీసుకుని మొలకెత్తిన గింజలు, పల్లీలు, కట్ చేసుకున్న డ్రైఫ్రూట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు మిరియాలపొడి, ఉప్పు, నిమ్మరసం కూడా వేసి మరోసారి కలపాలి. చివరగా కొత్తిమీర తరుగు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే సరి. హెల్దీ, టేస్టీ ప్రొటీన్ సలాడ్ రెడీ.