ప్రతి చెల్లీ తన అన్నలో హీరోను చూసుకుంటుంది. ప్రతి అక్కా తన తమ్ముడు బంగారమే అనుకుంటుంది.ఆ అంచనాలో ఏ కొంత తేడా వచ్చినా అక్కాచెల్లెళ్ల మనసు చివుక్కుమంటుంది. కాబట్టి, అన్నదమ్ముల ప్రతి అడుగూ బాధ్యతాయుతంగా పడాలి, ప్రతి మాటా తూకమేసినంత కచ్చితంగా ఉండాలి. ఏ మహిళ హృదయాన్నీ గాయపరచకూడదు. ఏ స్త్రీ గౌరవాన్నీ దిగజార్చకూడదు. ఇది అక్క ఆశ, చెల్లి నమ్మకం,రక్షా బంధనంలో కనిపించని ముడి. తోబుట్టువుల సాక్షిగా ప్రతి యువకుడూ రాఖీ పున్నమినాడు ఓ ప్రమాణం చేయాలి. త్రికరణశుద్ధిగా ఆ వాగ్దానాన్ని ఆచరించాలి..