మంగళవారం 11 ఆగస్టు 2020
Zindagi - Jul 02, 2020 , 23:40:21

‘ఉచిత వినోదం’.. ఓ సైబర్‌ వల!

‘ఉచిత వినోదం’.. ఓ సైబర్‌ వల!

లాక్‌డౌన్‌ వల్ల కోట్లమంది ఇంటికే పరిమితం అయ్యారు. చాలా మంది ఆన్‌లైన్‌లో సినిమాలు, వెబ్‌ సిరీస్‌ చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇదే అదనుగా సైబర్‌ మోసగాళ్లు కొత్త పంథాను ఎంచుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. సాధారణంగా, డిజిటల్‌ వేదికపై విడుదలయ్యే సినిమాలను చూడాలంటే ఎంతోకొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ సినిమాల్ని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే వీలు కల్పిస్తూ.. నకిలీ వెబ్‌సైట్లను సృష్టిస్తున్నారు. దీంతో చాలామంది  ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా.. మొబైల్‌ ఫోన్లకూ, కంప్యూటర్లకూ ఓ వైరస్‌ను పంపి.. పర్సనల్‌ డాటాను మొత్తం చోరీ చేస్తున్నారు. కార్డులను దుర్వినియోగం చేయడమే కాదు, ఫొటోల ఆధారంగా బ్లాక్‌మెయిల్‌కూ పాల్పడుతున్నారు. ఈ తరహా వ్యవహారాల్ని తాజాగా మహారాష్ట్ర సైబర్‌ సెల్‌ పోలీసులు కనిపెట్టారు. సినిమాలు, వెబ్‌ సిరీస్‌ చూడాలనుకుంటే ఒరిజినల్‌ వెబ్‌సైట్లనే ఎంచుకోవాలని  సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.  


logo