e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home జిందగీ ‘క్లిక్‌' అంటే.. ఫారిన్‌ కాస్మొటిక్స్‌!

‘క్లిక్‌’ అంటే.. ఫారిన్‌ కాస్మొటిక్స్‌!

బంధువులో, స్నేహితులో విదేశాల నుంచి వస్తున్నారంటే చాలు.. ‘ఏవైనా మంచి కాస్మొటిక్స్‌ తీసుకురావచ్చుగా’ అనే అడుగుతారు చాలామంది మహిళలు. అన్నిసార్లూ అది సాధ్యం కాకపోవచ్చు. ఆ విదేశీ బ్రాండ్లేవో ఆన్‌లైన్‌లో చవకగా దొరికితే, ఎవర్నో బతిమాలాల్సిన పని ఉండదు. ఆ ఆలోచనతోనే ఫారిన్‌ సౌందర్య సాధనాలను భారత్‌లో విక్రయిస్తున్నారు అమెరికాలో స్థిరపడిన తెలంగాణ మహిళ స్వప్నారెడ్డి.ఆ బిజినెస్‌ జర్నీ గురించి ఆమె మాటల్లోనే..

మా స్వస్థలం మిర్యాలగూడ. నా పదేండ్ల వయసు వరకూ కుటుంబమంతా అక్కడే ఉండేది. నాన్న మండల విద్యాశాఖ అధికారి. తనకు వ్యాపారాలూ ఉండేవి. దాంతో మేమంతా హైదరాబాద్‌కు మకాం మార్చాం. నేను బీసీఏ (బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) చదివాను. డిగ్రీ కాగానే పెండ్లయింది. భర్తతో కలిసి అమెరికా వెళ్లిపోయాను. ఆయన అమెరికాలో ఉంటూనే యూరప్‌ బేస్డ్‌ గేమింగ్‌ కంపెనీ పెట్టారు. నేనూ చాలా ఏండ్లు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేశాను. నా కూతుళ్లిద్దరూ స్కూలింగ్‌ చేస్తున్నారు. త్వరలోనే హైదరాబాద్‌లో స్థిరపడే ఆలోచన ఉంది.

- Advertisement -

మొదలైందిలా..
నేను అమెరికా నుంచి వస్తున్నానని ఎప్పుడు చెప్పినా, మా కజిన్స్‌ అంతా అక్కడి నుంచి బ్యూటీ ప్రొడక్ట్స్‌ తెమ్మని అడిగేవాళ్లు. ఇలాంటి అనుభవం నాకే కాదు, విదేశాల్లో స్థిరపడిన చాలామందికి ఉంటుంది. కొన్నాళ్లకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం మెకానికల్‌గా అనిపించింది. ఇండియాలో ఏదైనా వ్యాపారం మొదలుపెడితే బాగుంటుందని అనుకున్నాను. అప్పుడు వచ్చిన ఐడియానే.. బ్యూటీ ప్రొడక్ట్స్‌ బిజినెస్‌. అప్పటికి నాకు ఈ పరిశ్రమ గురించి ఎలాంటి అవగాహనా లేదు. అమెరికాతో పాటు ఇటలీ, సింగపూర్‌లాంటి చాలా దేశాలు తిరిగి బ్యూటీ ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడాను. భారతీయుల చర్మానికి, భారతీయ వాతావరణానికి అనువైన బ్రాండ్స్‌ కోసం ఐదారేండ్లు వెతికాను. ఆ సమయంలోనే నాకు అమిత్‌ పరిచయం అయ్యారు. తనకూ బ్యూటీ ప్రొడక్ట్స్‌ బిజినెస్‌ మొదలుపెట్టాలని ఉందని చెప్పారు. మేమిద్దరం కలిసి గురుగ్రామ్‌లో ‘లూజో బాక్స్‌’ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించాం. లూజో అంటే స్పానిష్‌లో ‘లగ్జరీ’. తక్కువ ధరలో లగ్జరీ ప్రొడక్ట్స్‌ అందించడమే మా వ్యాపార లక్ష్యం. అందుకే ఈ పేరు ఖరారు చేశాం.

మేం సంతృప్తి చెందితేనే..
మా కంపెనీలో ప్రస్తుతం ముప్పై విదేశీ బ్రాండ్స్‌ ఉన్నాయి. త్వరలో మరిన్ని అందించే ఆలోచన ఉంది. మేం ఏది పడితే అది కస్టమర్లకు అంటగట్టం. ముందుగా పేరున్న ఉత్పత్తులను ఎంచుకుని నేను, మా టీమ్‌ టెస్ట్‌ చేస్తాం. సంతృప్తి చెందాకే మార్కెట్లోకి తీసుకొస్తాం. డెర్మటాలజిస్ట్‌లు, ప్లాస్టిక్‌ సర్జన్‌ల సలహాలు, సూచనలు తీసుకుంటాం. కస్టమర్‌ ఫీడ్‌బ్యాక్‌ను మెసేజ్‌, ఇ-మెయిల్‌, వీడియోల ద్వారా అందుకుంటాం. సౌందర్య ఉద్దీపన గురించి అడిగినవారికి తగిన సూచనలు చేస్తాం. ప్రస్తుతం, మా ఫోకస్‌ అంతా సౌత్‌ ఇండియాపైనే. అమ్మవల్లే నాకు స్కిన్‌కేర్‌ అవసరం తెలిసింది. మా అమ్మ అందగత్తె. కానీ, ముఖంపై త్వరగాముడతలు వచ్చేశాయి. ముందే తగిన జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందని ఫీలవుతూ ఉంటుంది. మా అమ్మలా బాధపడుతున్నవాళ్లు ఎంతోమంది ఉంటారు. ఇప్పటికీ, సగటు మహిళలు స్కిన్‌ కేర్‌ అంటే మేకప్‌ వేసుకోవడమే అనుకుంటారు. ఆ అపోహలన్నీ పోగొట్టాలి. ఏ కాలంలో చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించాలి. పైగా ఫారిన్‌ బ్రాండ్స్‌ను ఇష్టపడేవాళ్లకు ఒక్క క్లిక్‌తో ఆ ఉత్పత్తులు దొరకడం సంతోషకరమైన విషయమే కదా. ఇప్పటికైతే మా బిజినెస్‌ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నది. ఏదో ఒక రోజు ఇండియాలో ఒక తయారీ యూనిట్‌ పెట్టాలని ఉంది. అందులో ఒంటరి మహిళలకు, పేద విద్యార్థులకు పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ ఇవ్వాలని అనుకుంటున్నా. ఏదేమైనా, నా దేశానికి ఎంతోకొంత చేయాలని మనసులో ఎప్పుడూ ఉంటుంది. దానికోసం శాయశక్తులా ప్రయత్నిస్తాను.

… నిఖిత నెల్లుట్ల

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana