మామిడితో ముడతలు మాయం!

ఇప్పుడు సీజన్ కాదు కానీ, ఫలరాజు మామిడి చేసే మేలు అంతా ఇంతా కాదంటున్నారు పరిశోధకులు. ఈ పండులో పుష్కలంగా ఉండే క్యాల్షియం, విటమిన్-బి ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాదు చర్మ సౌందర్యాన్నీ ఇనుమడింపజేస్తాయని తేలింది. మామిడి పండ్లను తినడం వల్ల వయసు రీత్యా వచ్చే ముడతలు తగ్గుతాయని చెబుతున్నారు. యాభై ఏండ్లు పైబడిన 28 మంది మహిళలపై నాలుగు నెలలపాటు జరిపిన అధ్యయనం ద్వారా ఈ విషయం తేటతెల్లమైంది. రోజూ ఒకటిన్నర కప్పు మామిడి పండ్ల ముక్కలు తిన్నవారి చర్మం ముడతలు కోల్పోయి కాంతివంతంగా తయారవడాన్ని గమనించారు. మామిడి పండ్లు సూర్యుడి అతినీల లోహిత కిరణాలను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మాంగి ఫెరిన్, నోరాటిరియోల్, రెస్వెరాట్రాల్, క్వెర్సెటిన్ .. యూవీ కిరణాల వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని ఎదుర్కోవడంలో, వృద్ధాప్య సంకేతాలను నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయట. అంతేకాదు ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇమ్యునో మాడ్యులేటరీ, విటమిన్-సి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడం ద్వారా వయసురీత్యా వచ్చే సమస్యల నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తాయని చెబుతున్నారు. మామిడిలో పుష్కలంగా ఉండే ప్రొటీన్, ఫైబర్, విటమిన్-సి, విటమిన్- ఎ, ఫోలిక్ యాసిడ్, విటమిన్- బి 6, విటమిన్-కె, పొటాషియం.. ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల నివారణలోనూసాయపడతాయని పరిశోధకులుచెబుతున్నారు.
తాజావార్తలు
- కష్టాల్లో భారత్.. కెప్టెన్ రహానే ఔట్
- రిపబ్లిక్ డే పరేడ్.. ట్రాఫిక్ ఆంక్షలు
- 23 వరకు ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేక బస్‌పాస్ కౌంటర్
- టీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్‌లు
- మహారాష్ట్రలో నిలిచిన కొవిడ్ టీకా పంపిణీ
- జీహెచ్ఎంసీ గెజిట్ వచ్చేసింది..
- బస్‌కు వ్యాపించిన మంటలు.. ఆరుగురు మృతి
- మూడో వికెట్ కోల్పోయిన భారత్
- పని ఉందని తీసుకెళ్లి దోపిడీ..
- యూట్యూబ్‌లో చూసి.. బైక్‌ల చోరీ