బాల్యం నుంచి యవ్వన దశకు చేరే క్రమంలో శారీరకంగా, మానసికంగా అమ్మాయిల్లో ఎన్నో మార్పులు జరుగుతాయి. వీటన్నిటికీ కారణం హార్మోన్ల్లే. అయితే రజస్వల కావడానికి ముందు, అయిన కొత్తలో ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు చేసుకోవాలి. పోషక విలువలతో కూడిన డైట్ తప్పనిసరి.
కౌమారంలో శారీరకంగా, మానసికంగా ఒత్తిళ్లకు లోనవుతారు. అలాంటి సమయంలో వ్యాయామం లేకపోతే సులువుగా బరువు పెరుగుతారు. ఆ ఒత్తిడిలో కడుపు మాడ్చుకుంటారు. దీనివల్ల అనోరెక్సియా నర్వోసా, బ్యులీమియా మొదలైన ‘ఈటింగ్ డిజార్డర్స్’కు గురవుతారు. ఫాస్ట్ఫుడ్స్ తినడంవల్ల క్యాల్షియం, ఐరన్, విటమిన్-ఎ లోపాలు కనిపిస్తుంటాయి.
ఊబకాయం బారిన పడకుండా, పోషకాల లోపం రాకుండా సమపాళ్లలో పోషకాహారం తీసుకోవాలి. క్యాల్షియం పుష్కలంగా ఉండే ఆహారం తప్పనిసరి. దీనివల్ల ఎముకల సామర్థ్యం పెరుగుతుంది. జీరో క్యాలరీ ఆహార పదార్థాలైన కార్బొనేటెడ్ పానీయాలు తాగొద్దు. అనీమియా రాకుండా ఐరన్ శాతం ఎక్కువగా ఉండే పదార్థాలను తినాలి. ఎదుగుదలకు కావాల్సిన ప్రొటీన్లు, క్యాలరీలు అందించే ఆహార పదార్థాలను భోజనంలో భాగం చేసుకోవాలి. విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలను డైట్లో చేర్చుకోవాలి. వాకింగ్, స్కిప్పింగ్, స్పోర్ట్స్.. ఏదో ఓ వ్యాయామం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల అధిక బరువు సమస్య దరిచేరదు. ఆకలి కూడా పెరుగుతుంది.
మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్,www.trudiet.in