Zindagi
- Dec 02, 2020 , 00:11:56
పూల రెక్కలు.. కొన్ని పండ్ల ముక్కలు..

ఇప్పుడు సబ్బులు ప్రకృతి సిద్ధమైన గుణాలతోపాటు రకరకాల పువ్వుల్నీ, పండ్లనీ, ఔషధాలనీ నేరుగా తమలో పొదువుకుని సరికొత్తగా ముస్తాబవుతున్నాయి. చక్కని రంగుల్లో, విభిన్నమైన ఆకృతుల్లో ఆకర్షణీయంగా తయారవుతూ మార్కెట్లోకి వస్తున్నాయి.
- చలికాలం చర్మ సంరక్షణ అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది గ్లిజరిన్ సబ్బులే. పారదర్శకత వీటి ప్రత్యేకత. ఈ సబ్బుల్ని ఎన్నో రంగుల్లో, మరెన్నో రూపాల్లో అందిస్తూ వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్నాయి తయారీ సంస్థలు. పూల రెక్కలు, కొన్ని తేనెచుక్కలు, ఇంకొన్ని పండ్ల ముక్కలు కలగలిపి సబ్బులను తీర్చిదిద్దుతున్నాయి.
- గ్లిజరిన్‌లో ఉండే కొవ్వు పదార్థాలు చర్మానికి తేమనందిస్తే పూలూ, పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు నిగారింపునూ, మృదుత్వాన్నీ అందిస్తాయి. పైగా వాటి నుంచి వచ్చే సువాసనలు మనసును తేలిక పరిచి ఒత్తిడిని తగ్గిస్తాయి.
- ఇప్పుడు గులాబీ, చామంతి, బంతి, కుంకుమ పువ్వు, లావెండర్, మందార వంటి పూలతోపాటు నిమ్మ, నారింజ, కివీ వంటి పండ్లనీ, పుదీనా, తులసి వంటి ఔషధాలనూ నేరుగా గ్లిజరిన్ సబ్బుల్లోకి చొప్పిస్తున్నారు తయారీదారులు. సరికొత్త ఆకృతుల్లో వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. సబ్బులకు పూలు, పండ్ల ఆకృతినిచ్చి పిల్లలనూ, పెద్దలనూ ఆకట్టుకుంటున్నారు.
తాజావార్తలు
- తెలంగాణ సూపర్
- ఈడబ్ల్యూఎస్ కోటాతో సమతూకం
- మేధోకు 2211 కోట్ల కాంట్రాక్టు
- 18 దేశాల్లో టిటా కమిటీలు
- టీజీటీఏ ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్
- 25 నుంచి పీజీ ఈసెట్ స్పెషల్ కౌన్సెలింగ్
- ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
- 24, 25న ఈఎస్సీఐ ఎంబీఏలో స్పాట్ అడ్మిషన్లు
- గిరిజనుల ఆర్థికాభివృద్ధే ఐటీడీఏ లక్ష్యం
- ఓయూ దూరవిద్య డిగ్రీ ఫలితాలు
MOST READ
TRENDING