చల్లని వాతావరణం అనేది ప్రకృతి అందించిన శక్తిమంతమైన ‘మెటబాలిక్ బూస్టర్’. చల్లచల్లని వాతావరణంలో శరీరంలోని బ్రౌన్ ఫ్యాట్ లెవల్స్ పెరుగుతాయి. మనం విశ్రాంతి తీసుకుంటున్నా సరే, ఈ బ్రౌన్ ఫ్యాట్ అధిక క్యాలరీలను కరిగిస్తుంది. చల్లటి వాతావరణంలో బయట తిరిగినా అది నాన్ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనెసిస్ (ఎన్‌ఈఏటీ) స్కోర్‌ని పెంచుతుంది. అలాగే, క్యాలరీలను ఖర్చు చేయడంలో ఉపయోగపడుతుందని వాషింగ్టన్‌లోని రిచ్ల్యాండ్కు చెందిన పరిశోధకులు తెలిపారు. అంతేకాకుండా, చల్లటి నీళ్లతో స్నానం చేసినప్పుడు శరీరంలో వణుకు పుడుతుంది. అప్పుడు వెచ్చదనం కోసం శరీరం క్యాలరీలను ఖర్చు చేస్తుంది. అయితే, చల్లదనం వల్ల బరువు తగ్గడం అంత త్వరగా జరగదు కానీ, దీర్ఘకాలంలో మాత్రం తప్పక ఫలితాలు ఉంటాయంటున్నారు. అలాగే, ఈ కోల్డ్ టెక్నిక్ వాడుతూనే చిన్నచిన్న వ్యాయామాలు, వారానికి నాలుగుసార్లు యోగా, వాకింగ్ చేస్తే వెయిట్ లాస్ ఫలితాలు త్వరగా కనిపిస్తాయి.