హ్యాండ్లూమ్ చీరలంటే మహిళలు మనసు పారేసుకుంటారు. చీరలేనా? హ్యాండ్లూమ్ కుర్తాలు, గౌన్లుకూడా మగువల మనసులను దోచేస్తున్నాయి. ఈతరం అమ్మాయిల టేస్ట్‌కు సరిపోయేలా ఇండో వెస్ట్రన్ స్టయిల్లో రూపొందించిన డిజైన్లేంటో చూద్దాం..
బార్డర్‌తో భలేగా!
నారాయణపేట కాటన్ బార్డర్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన గౌన్ ఇది. మరీ పొట్టిగా కాకుండా, లాంగ్లెన్త్ గౌన్లకు కాస్త భిన్నంగా మోకాళ్ళ వరకూ రూపొందించారు. ‘వీ’ షేప్ నెక్, స్లీవ్‌లెస్ హ్యాండ్స్ ఇచ్చారు. బ్లూ కలర్‌కి కాంట్రాస్ట్‌గా ఆరెంజ్ కాంబినేషన్లో ఏనుగుల డిజైన్‌తో బార్డర్ ఇచ్చారు. బాటమ్ పార్ట్‌కి ప్రిల్స్, రెండు వైపులా పాకెట్స్ ప్రత్యేకంగా అనిపిస్తాయి. బార్డర్‌కి నప్పేలా నెక్, హ్యాండ్స్‌కి పైపింగ్ చేశారు. సంప్రదాయంగా కనిపిస్తున్న వెస్ట్రన్ ఫ్రాక్ ఇది.
ముచ్చటైన కుచ్చులు
పూర్తి ప్లెయిన్ మెహెందీ గ్రీన్ మంగళగిరి కాటన్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన రఫుల్ గౌన్ ఇది. రౌండ్ నెక్, స్లీవ్‌లెస్ హ్యాండ్స్ ఇచ్చారు. బాడీ పార్ట్‌కి బాటమ్ పార్ట్‌ని జత చేస్తూ ప్రిల్స్ ఇస్తూ.. బార్డర్, నడుము, మెడ దగ్గర రఫుల్స్‌తో హైలైట్ చేశారు. ట్రెండీగా కనిపిస్తున్న పార్టీవేర్ ఫ్రాక్ ఇది.
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్, follow us on: instagram.com/
riteshareddy, 70136 39335