ఎన్ని ఆధునిక దుస్తులు వచ్చినా అమ్మాయిల అభిమాన డ్రెస్.. చుడీదారే. సంప్రదాయంతోపాటు లేటెస్ట్ ట్రెండ్ కలబోసినకలెక్షన్లంటే నవతరం అతివలకు మరీ ఇష్టం. పట్టుతో చెట్టాపట్టాలేసుకుని.. పండుగలు, శుభకార్యాల్లో సౌకర్యంతోపాటు సౌందర్యాన్ని ఇచ్చే మంగళగిరి పట్టు చుడీదార్ డిజైన్లేమిటో చూద్దాం..
కలంకారి జతగా
స్మార్ట్ అండ్ ైస్టెలిష్ లుక్ ఇచ్చే లెమన్ ఎల్లో మంగళగిరి పట్టు ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన డిజైన్ ఇది. స్ట్రెయిట్ కుర్తా చేతులకు, చివరన సన్నటి బార్డర్ జతచేశారు. స్కేర్ నెక్, రిస్ట్ సైజ్ ఫుల్ హ్యాండ్స్‌తో ట్రెండీ లుక్ వచ్చింది. హ్యాండ్ ప్రింటెడ్ కలంకారి దుపట్టా ట్రెడిషనల్ లుక్‌తో హైలైట్ అయ్యింది. కుర్తాకు జతగా క్రీమ్ లేదా వైట్ లెగ్గింగ్ చక్కగా సరిపోయింది.
‘పట్టు’ కళ..
అమ్మాయిల ఎవర్గ్రీన్ ఫేవరెట్.. పింక్ కలర్ మంగళగిరి పట్టు ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన డిజైన్ ఇది. ప్లెయిన్ కుర్తా చేతులకు, చివరన పట్టుతో చిన్న బార్డర్ ఇచ్చారు. మోచేతుల వరకూ హ్యాండ్స్, బాడీ పార్ట్‌లో చిన్న డ్రాప్ కట్ ఇచ్చి బోట్నెక్ను హైలైట్ చేశారు. ఫుల్క్రీమ్ కలర్‌పై.. మస్టర్డ్ ఎల్లో డిజైన్ దుపట్టా విత్ బార్డర్ కుర్తాకు చక్కగా నప్పింది. ఈ కుర్తాపై క్రీమ్ లేదా వైట్ లెగ్గింగ్ చక్కగా
సరిపోతుంది.
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్ follow us on: instagram.com/
riteshareddy, 70136 39335