గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Sep 20, 2020 , 19:05:52

పక్షిని పట్టుకుని ఆరగిస్తున్న సాలీడు!.. వీడియో వైరల్

పక్షిని పట్టుకుని ఆరగిస్తున్న సాలీడు!.. వీడియో వైరల్

పాము పిల్లను పట్టుకుని తినేందుక సిద్ధమైన సాలీడు ఇటీవల వెలుగులోకి వచ్చింది. నిజానికి సాలీడులు తమ గూటిలోకి వచ్చే చిన్నచిన్న క్రిములను పట్టుకుని తింటాయి. చిన్న క్రిములు వీటి వలకు చిక్కుకోగానే వెంటనే వాటిపై లగాయించి పట్టేసుకుని విషాన్ని విరజిమ్ముతాయి. అవి చనిపోగానే మెల్లమెల్లగా తినే పని మొదలుపెడతాయి.  

పాము పిల్లలు అయితే ఫర్వాలేదు గానీ ఏకంగా పక్షులనే తినేందుకు సాలీడు సిద్ధమైందంటే ఆశ్చర్యమేస్తుంది కదూ! మీరు చదివేది నిజమే. తన గూడు వద్దకు పొరపాటున వచ్చిన ఓ పక్షిని అమాంతం పట్టేసుకుని మింగేయడానికి ఓ నల్ల సాలీడు సిద్ధమైంది. ఈ వీడియో ఇటీవల వైరల్ కావడంతో నెటిజెన్లు తలో రకంగా కామెంట్లు పెడుతున్నారు. 

ట్విట్టర్ హ్యాండిల్ నేచర్ ఈజ్ స్కేరీ అనే శీర్షికతో ఈ వీడియోను పంచుకున్నారు. 54-సెకన్ల నిడివి గల ఈ వీడియోలో పెద్ద సైజు అవికులేరియా సాధారణ పరిమాణంలో ఉన్న ఓ పక్షిని తినడం కనిపిస్తుంది. సాలీడు నెమ్మదిగా-నెమ్మదిగా పక్షిని తన నోట్లోకి తీసుకోవడం కనిపిస్తుంది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి సాలీడును చూడలేదు అని, ఇలాంటివి పెంచుకుంటున్న ఇంటి యజమానికి నమస్కారాలు అంటూ.. ఒక్కొక్కరు ఒక్కో రకంగా కామెంట్లు పోస్టు చేస్తున్నారు. logo