శుక్రవారం 30 అక్టోబర్ 2020
Zindagi - Aug 12, 2020 , 22:51:06

అగ్నిసాక్షిగా ప్రేమిస్తున్నా...

అగ్నిసాక్షిగా ప్రేమిస్తున్నా...

ఆయన పేరు రికీ. ఇంగ్లాండ్‌లో ఓ స్టంట్‌ మాస్టర్‌. సినిమాల్లో  వేశాలు వేస్తుంటాడు. ఆవిడ పేరొచ్చి కట్రినా డోబ్సన్‌. కెంట్‌ దవాఖానాలో నర్సమ్మ. ఇద్దరి చూపులు కలిశాయి. డేటింగ్‌ కుదిరింది.  ఇంతలో కరోనా బాధితుల సేవలోనే బిజీ అయిపోయిందామె. ఎడబాటు అతడ్ని దహించేసింది. తన ప్రేయసిని పెళ్లికి ఒప్పించాలనుకున్నాడు. స్టంట్‌ మాస్టర్‌ కదా! ఫైర్‌ ఫీట్‌ చేశాడు. మంటలు చెలరేగుతుండగా తన ప్రియురాలి ఎదుట మోకరిల్లి.. ఉంగరాన్ని కానుకగా సమర్పిస్తూ.. ప్రేమ భిక్ష కోరాడు. మొదట భయపడిందామె. తర్వాత మురిసిపోయింది. అగ్నిసాక్షిగా ప్రేమను ఒప్పుకొంది. ఈ ఫైర్‌స్టార్‌ విన్యాసం మాత్రం సామాజిక  మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.