శనివారం 04 జూలై 2020
Zindagi - Jun 29, 2020 , 16:55:13

క‌ళ్ల‌జోడు పెట్టుకొని మాస్క్ ధ‌రించాలంటే ఇబ్బందిగా ఉందా? ఇలా చేయండి!

క‌ళ్ల‌జోడు పెట్టుకొని మాస్క్ ధ‌రించాలంటే ఇబ్బందిగా ఉందా? ఇలా చేయండి!

మాస్క్ పెట్టుకోకుండా బ‌య‌టికి వ‌చ్చే ప‌రిస్థితి దాటిపోయింది. సాధార‌ణ వ్య‌క్తులే మాస్క్‌ పెట్టుకోవ‌డానికి విసుగు చెందుతున్నారు. ఇది పెట్టుకోవ‌డం వ‌ల్ల గాలి ఆడ‌ద‌ని వాపోతున్నారు. మ‌రి క‌ళ్ల‌జోడు పెట్టుకునేవాళ్ల‌కి ఇంకెంత ఇబ్బందిక‌రంగా ఉంటుందో ఊహించ‌గ‌ల‌రా! నోటి నుంచి వ‌చ్చే శ్వాస ఆవిరి రూపంలో క‌ళ్ల‌ద్దాల మీద పడ‌డంతో మ‌స‌గ్గా మారిపోతుంది. దీంతో ముందున్న వారెవ్వ‌రూ క‌నిపించ‌రు. స‌ర్లే చేతుల‌తో అద్దాల‌ను శుభ్ర‌ప‌రుచుకుందామంటే క‌రోనా భ‌యం. దీనికి మంచి సొల్యుష‌న్ ఉంది. అదేంటో చూద్దాం..

టిష్యూతో..

క‌ళ్ల‌జోడు పెట్టుకునేవాళ్ల ద‌గ్గ‌ర టిష్యూ పేప‌ర్ ఉంటే స‌రిపోతుంది. ముందుగా ఇంటి నుంచి బ‌య‌లుదేరేట‌ప్పుడు మాస్క్‌తో పాటు ఒక టిష్యూ కూడా తీసుకోవాలి. మాస్క్ ఎంత ప‌రిమాణంలో అయితే ఉంటుందో అదే సైజులో టిష్యూని ఫోల్డ్ చేయాలి. చేసిన త‌ర్వాత మాస్క్‌కు గ‌ట్టి అదిమి పెట్టాలి. త‌ర్వాత మాస్క్‌ను ముఖానికి క‌ట్టుకొని టిష్యూ పేప‌ర్ లూజ్‌గా లేకుండా టైట్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత క‌ళ్ల‌జోడు కూడా పెట్టుకొని ఒక సారి గ‌ట్టిగా శ్వాస వ‌దిలి చెక్ చేసుకోవాలి. దీనివ‌ల్ల శ్వాస గాలి పైకి వ‌చ్చినా అద్దాల‌మీద ఎలాంటి ప్ర‌భావం చూప‌దు. ఇలా చేసుకుంటే స‌రిపోతుంది.


logo