మంగళవారం 02 మార్చి 2021
Zindagi - Jan 22, 2021 , 00:19:36

పోషక ‘కమలం’

పోషక ‘కమలం’

డ్రాగన్‌ ఫ్రూట్‌.. ఎర్రని తొక్క, తెల్లని గుజ్జు, నల్లని విత్తనాలతో ఏమంత రుచిగా అనిపించని ఈ పండులో పోషకాలు మాత్రం అపారం. పుట్టింది దక్షిణ అమెరికాలో అయినా, ఇప్పుడు మనదేశంలోనూ విరివిగా పండిస్తున్నారు. ఇటీవలే, ఈ ఫలానికి ‘కమలం’ అని నామకరణం చేసింది గుజరాత్‌ ప్రభుత్వం.

  • డ్రాగన్‌ పండ్లలో విటమిన్‌- సి తోపాటు ఐరన్‌, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుంది. ఎంత తింటే అంత చురుకుదనం. 
  • జీర్ణక్రియ సాఫీగా సాగడానికి దోహదం చేసే ఫైబర్‌ కూడా ఎక్కువే. మలబద్ధకాన్ని నివారించవచ్చు. పండులోని పోషకాలు చెడు కొవ్వులను మంచి కొవ్వులుగా మార్చి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 
  • బరువు తగ్గాలనుకునేవారికి డ్రాగన్‌ ఫ్రూట్స్‌ బెస్ట్‌ డైట్‌. ఎందుకంటే, ఇందులో కేలరీలు నామమాత్రం. డ్రాగన్‌ ఫ్రూట్‌లోని క్యాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, నియాసిన్‌ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులోని బెటాలాయిడ్స్‌, కెరొటినాయిడ్స్‌ క్యాన్సర్‌ నిరోధకాలుగా పనిచేస్తాయి. 
  • డ్రాగన్‌ ఫ్రూట్‌లోని యాంటీ ఆక్సిడెంట్‌లు చర్మానికి మేలు చేస్తాయి. డ్రాగన్‌ ఫ్రూట్‌ను మెత్తగా మెదిపి, తేనె కలిపి సహజ యాంటీ ఏజింగ్‌ మాస్క్‌ను తయారుచేయవచ్చు. దీంతో మొటిమల నుంచి ఉపశమనమూ పొందవచ్చు. 

VIDEOS

logo