e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జిందగీ హింస భరించొద్దు!

హింస భరించొద్దు!

హింస భరించొద్దు!

పెండ్లయిన కొత్తలోనే మ్యూచువల్‌ కన్సెంట్‌ డైవోర్స్‌ కావాలని నా భర్త ఒత్తిడి తీసుకొచ్చాడు. దానికి నేను ఒప్పుకోవట్లేదని మానసికంగా, శారీరకంగా ఎంతో హింసించాడు. గృహహింసను తట్టుకోలేక చివరికి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. తర్వాతైనా, నాతో కలిసి ఉండేందుకు సుముఖత చూపిస్తాడేమోనని ఏడాది పాటు ఎదురుచూశాను. ఇప్పటికీ విడాకులు తీసుకుందామనే ఒత్తిడి చేస్తున్నాడు. మా అత్తింటి వాళ్లు కూడా మమ్మల్ని కలిపేందుకు ప్రయత్నించడం లేదు. నాకేం చేయాలో అర్థం కావడంలేదు.

ఓ సోదరి, హైదరాబాద్‌

మ్యూచువల్‌ కన్సెంట్‌ డైవోర్స్‌కి అప్లయ్‌ చేయాలంటే పెండ్లయి కనీసం ఏడాది గడవాలి. అలాగే భార్యాభర్తలిద్దరూ విడాకులు కావాలనుకుంటేనే, Mutual Divorceకి వెళ్లాల్సి ఉంటుంది. అంతేతప్ప, మీ అంగీకారం లేకుండా ఆయన మీపై ఏమాత్రం ఒత్తిడి తీసుకురాకూడదు. మిమ్మల్ని మానసికంగా అవమానిస్తూ గృహహింసకు పాల్పడుతున్నాడు కాబట్టి, తనపై డొమెస్టిక్‌ వయెలెన్స్‌ కేసు ఫైల్‌ చేయొచ్చు. నా స్నేహపూర్వక సలహా ఏమిటంటే, మీ భర్త మిమ్మల్ని ఎంత వద్దనుకుంటున్నా మీరు ఆయనతో కలిసి ఉండాలనుకోవడంలో అర్థం లేదు. మీపై ప్రస్తుతం ఎన్నో కుటుంబపరమైన ఒత్తిళ్లు ఉండొచ్చు. కానీ, మీకు మీరే చాలా ముఖ్యమైన వ్యక్తి. మీ జీవితం మీకు నచ్చినట్టు ఉండాలి తప్ప, ఎవరికోసమో బాధలను భరించొద్దు. మీ భర్తకైనా సరే, మిమ్మల్ని అగౌరవపరిచే హక్కు లేదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.

హింస భరించొద్దు!
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హింస భరించొద్దు!

ట్రెండింగ్‌

Advertisement