పెండ్లిళ్ళు, శుభకార్యాలు, పండుగలు.. ఏ సంప్రదాయ వేడుకల్లో అయినా లెహంగాలదే హవా. పెండ్లికూతుళ్ల నుంచి చిట్టి పాపాయిల వరకు పెద్ద లెహంగాల్లో నిండుగా కండ్లముందు తిరుగుతుంటారు. పొడవాటి లెహంగా, దానికి నప్పే టాప్‌ని కొంచెం కూడా ఖాళీ లేకుండా వర్క్‌తో నింపేసి, గ్రాండ్ లుక్‌తో అదరగొడుతున్నారు డిజైనర్లు. లేటెస్ట్ లెహంగా డిజైన్లను తెలుసుకుందాం.
గోల్డ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఈ లెహంగాను డిజైన్ చేశారు. లెహంగాకోసం ప్యూర్ బెనారస్ క్రీమ్ కలర్ నెట్టెడ్మీద గోల్డ్ కలర్‌తో వర్క్ చేశారు. లెహంగా బోర్డర్‌ని, బ్లౌజ్‌ని కంచిపట్టు కాంబినేషన్లో ఇచ్చారు. స్పెషల్‌గా బ్లౌజ్కోసం ఎల్లో జ్యూట్ ఫ్యాబ్రిక్‌ను తీసుకుని మగ్గం వర్క్ చేశారు. కంచి
పట్టుతో మోచేతులవరకు చేతులు పెట్టి లెహంగాకు కాంబినేట్ చేశారు. ఎల్లో అండ్ గోల్డ్‌తో ఫుల్ హెవీవర్క్ ఉన్న ఈ లెహంగాకి జతగా కట్‌వర్క్ చేసిన ఎల్లో నెట్ దుపట్టా చక్కగా నప్పింది.
ఈ లెహంగా కోసం హాఫ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌ని తీసుకున్నారు. ప్రత్యేకంగా.. హాఫ్ వైట్ బెనారస్ సిల్క్‌కి బ్లాక్ బెనారస్ సిల్క్‌తో బార్డర్ ఇచ్చారు. రా సిల్క్ బ్లౌజ్‌కి ఫుల్‌గా మగ్గం వర్క్ చేసి హైలైట్ చేశారు. పఫ్ హ్యాండ్స్ ఇచ్చి లెహంగా బార్డర్‌తో సరితూగేలా డిజైన్ చేశారు. లెహంగాకు, బ్లౌజ్‌కు నప్పేలా బ్లాక్ చెక్స్‌తో కట్ వర్క్ చేసిన ఆర్గాంజా దుపట్టా డిజైన్ చేశారు. కాంట్రాస్టింగ్ కలర్స్ అయిన బ్లాక్ అండ్ వైట్‌ను స్పెషల్‌గా గోల్డ్ త్రెడ్ వర్క్‌తో రూపొందించారు.
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్, follow us on: instagram.com/
riteshareddy, 7013639335