e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Home జిందగీ ఓ కంట కనిపెట్టండి

ఓ కంట కనిపెట్టండి

ఓ కంట కనిపెట్టండి

కరోనా కాలంలో పెద్దలతోపాటు పిల్లలూ సతమతమవుతున్నారు. ఏడాదిగా బడికి దూరమై, ఆన్‌లైన్‌కు అంకితమై మానసికంగా కుంగిపోతున్నారు చిన్నారులు. స్నేహితులను కలవలేకపోవడం, గ్రౌండ్‌కు దూరమవ్వడం, రోజంతా స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు అతుక్కొని కూర్చోవడం తదితర కారణాల వల్ల పిల్లలు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించి, సమస్యను గుర్తించి, పరిష్కరించాల్సింది తల్లిదండ్రులే.

మూడేండ్లలోపు పిల్లల్లో… ఒంటరిగా ఫీలవ్వడం, మంకుపట్టు పట్టడం, నిద్రపోయేటప్పుడు రకరకాల భంగిమల్లో పడుకోవడం, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుండటం వంటివి కనిపిస్తాయి. కాస్త పెద్దపిల్లలైతే సరిగా తినకపోవడం, రాత్రిళ్లు సమయానికి నిద్రపోకపోవడం, కడుపు నొప్పి, తలనొప్పి అని తరచూ చెప్పడం, మూడ్‌ స్వింగ్స్‌, ఆన్‌లైన్‌ క్లాసుల్లోనూ సరిగా పాల్గొనకపోవడం, రోజువారీ పనుల్లో ఆసక్తి చూపించకపోవడం వంటి లక్షణాలన్నీ మానసిక సమస్యలుగా గుర్తించాలి. టీనేజర్ల ప్రవర్తనలో వింత మార్పులు గమనించవచ్చు. చిన్నవిషయాలకే మొండిగా వ్యవహరించడం, వస్త్రధారణపై పెద్దగా ఆసక్తి చూపకుండా పాత బట్టలు వేసుకోవడం, తరచూ చావులు, ఆత్మహత్యల గురించే మాట్లాడటం వంటి ధోరణులు కనిపిస్తాయి. వీటన్నిటినీ ఇంట్లోని అమ్మానాన్నలు గమనించాలి. అంతటితో ఆగిపోకుండా, ఇలాంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే ఇదిగో ఈ పరిష్కారాలు ప్రయత్నించండి.

తల్లిదండ్రులు చేయాల్సిన పనులు..

 • పిల్లల విషయంలో ఎక్కువగా కంగారు పడకూడదు. వాళ్లు చెప్పే మాటలను నిదానంగా వినాలి.
 • పిల్లల ప్రైవసీని అర్థం చేసుకుంటూనే, తరచూ వాళ్లతో మాట్లాడుతుండాలి.
 • తమ ఒత్తిడిని పిల్లలపై ఎప్పుడూ చూపించకూడదు.
 • ఇంట్లో పిల్లలతో కలిసి యోగా లేదా చిన్నచిన్న ఎక్సర్‌సైజులు చేయాలి.
 • పరిశుభ్రత (చేతులు కడుక్కోవడం), ఫిజికల్‌ డిస్టెన్స్‌ పిల్లలకు ఇంట్లోనే అలవాటు చేయాలి.
 • కరోనా వైరస్‌ సృష్టించిన సంక్షోభం గురించి పిల్లలకు వివరంగా చెప్పాలి. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లపై సానుభూతి చూపించడం వంటి విషయాలపై పిల్లల్లో అవగాహన కల్పించాలి.
 • పిల్లలు ఏదైనా మంచి పని చేస్తే, వాళ్లను తప్పకుండా మెచ్చుకోవాలి.
 • ఏదైనా విషయంలో వద్దని చెప్పాల్సి వస్తే, దాన్ని పాజిటివ్‌గానే తెలపాలి. అంతేతప్ప వాళ్లతో వాదనకు దిగొద్దు.
 • అకడమిక్‌ షెడ్యూల్స్‌లో ఎప్పటికప్పుడు చురుగ్గా ఉండేలా చూడాలి.
 • పిల్లలను ఇంటి పనుల్లో ఎంగేజ్‌ చేయాలి. వాళ్లకు ఆయా పనుల్లో ఆసక్తి పెరిగేలా చూడాలి.
 • స్కూల్‌ అసైన్‌మెంట్లలో సాయం చేస్తుండాలి.
 • గార్డెనింగ్‌, ఇండోర్‌ గేమ్స్‌, స్టోరీ రీడింగ్‌, పెయింటింగ్‌ మొదలైనవి అలవాటు చేయాలి.
 • కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే వాకిట్లోనో, డాబా మీదో పిల్లలను తప్పకుండా ఆడించాలి.
 • ఫోన్‌ కాల్స్‌, వీడియో కాల్స్‌తో బంధువులు, స్నేహితులకు దగ్గరగా ఉంచాలి.
 • పిల్లల స్క్రీన్‌ టైమ్‌ని గమనించాలి. సోషల్‌ మీడియా అకౌంట్లలో పేరెంటల్‌ కంట్రోల్‌ ఆప్షన్స్‌ ఉంటాయి. వాటిద్వారా పిల్లల సోషల్‌ మీడియా యాక్టివిటీస్‌ని నియంత్రణలో పెట్టాలి.
 • నెలవారీ కుటుంబ బడ్జెట్‌లో పిల్లల్ని ఇన్వాల్వ్‌ చేయాలి. అప్పుడు వాళ్లకు కావాల్సిన వాటికి, అవసరమైన వాటికి మధ్య తేడా తెలుస్తుంది.
Advertisement
ఓ కంట కనిపెట్టండి
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement