‘కొవిడ్-19’ సీజన్లో శారీరక రుగ్మతతోపాటు మానసిక సమస్యలూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో మనసుకు ప్రశాంతతనిచ్చే అలవాట్లను జీవనశైలిలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా వంట, కుట్లు, అల్లికలు వంటివి మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి. ఈ పనులు చేసేటప్పుడు చేతులు అటూ ఇటూ ఆడుతూ ఉంటాయి. దీంతో శరీరంలో ‘డోపమైన్’ అనే హ్యాపీ హార్మోన్ (ఫీల్ గుడ్ కెమికల్) విడుదలవుతుంది. దీంతో, మహా సంతోషంగా అనిపిస్తుంది. పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. ఏ మూలనో నక్కినక్కి దాక్కున్న నెగెటివ్ ఆలోచనలు పరారైపోతాయి. చేసిన పని గురించి ఏ సామాజిక మాధ్యమాల్లోనో పెట్టినప్పుడు, బంధుమిత్రుల ప్రశంసలు మానవ సంబంధాల్ని బలపరుస్తాయి. నిత్యం టీవీల్లో వచ్చే కరోనా వార్తలనుంచి దృష్టిని మరల్చడానికి కూడా కుట్లూ, అల్లికలూ, వంటా వార్పూ చక్కగా ఉపయోగపడతాయి.