తీపి చేదెక్కకుండా..!

ఉరుకుల పరుగుల జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్లు అందరినీ అధిక బరువు పాలు చేస్తున్నాయి. ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి డైటింగ్, ఎక్సర్సైజ్, యోగా అంటూ పడరాని పాట్లు పడుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు రోజువారీ వ్యాయామంతోపాటు ఆహారం విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా చక్కెరకు ప్రత్యా మ్నాయంగా బెల్లం, తేనెవంటి వాటిని ఎంచుకోవాలంటున్నారు.
తేనె
ప్రకృతి ప్రసాదించిన వరం తేనె. దీనిలో ఔషధగుణాలు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలం. అంతేకాదు, సహజ సిద్ధమైన తేనెలోని యాంటీ ఆక్సిడెంట్స్ జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తాయి. దీర్ఘకాలం వేధించే అలర్జీలకు చక్కని పరిష్కారం తేనె. రోజూ ఉదయాన్నే గ్లాసెడు గోరువెచ్చని నీటిలో తగు మోతాదులో తేనె కలిపి తీసుకోవడం ద్వారా అలర్జీలకు చెక్ చెప్పవచ్చు. పాలు, స్వీట్లలో చక్కెరకు బదులు తేనెను వాడుకోవచ్చు.
బెల్లం
చాయ్ ప్రియులు రోజుకు ఐదు నుంచి ఆరు సార్లు కప్పు ఖాళీ చేస్తుంటారు. తరచూ చాయ్ తాగడం వల్ల చక్కెర ద్వారా శరీరంలో అధిక కేలరీలు జమవుతాయి. ఇవి బరువు పెంచడంతో పాటు ఆకలినీ హరిస్తాయి. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే చాయ్‌లో చక్కెరకు బదులుగా బెల్లం చేర్చుకోవాలని చెబుతున్నారు నిపుణులు. మలబద్ధకంతో బాధపడేవారికి బెల్లం మేలు చేస్తుంది. జీర్ణక్రియ సాఫీగా సాగేలా చూస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది.బెల్లంలోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది. దీంతో రక్తసరఫరా మెరుగవుతుంది.పాయసం, లడ్డూ, పొంగలి వంటి వంటకాల్లోనూ చక్కెరకు బదులు బెల్లం వాడితే ఆరోగ్యానికి మంచిది. అంతేకాదు, టీలో బెల్లంతోపాటు కొద్దిగా అల్లాన్ని కూడా చేర్చుకుంటే రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు, వివిధ అలర్జీలు తగ్గుతాయి. ఫ్రీ రాడికల్స్ చేసే నష్టాన్ని బెల్లంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిస్తాయి. తీపిని ఇష్టపడేవారు బెల్లం మిఠాయిలనూ ఎంచుకోవచ్చు.
తాజావార్తలు
- అల్లరి నరేష్‌కు దిల్ రాజు బంపర్ ఆఫర్
- ప్రేమోన్మాది ఘాతుకం..
- అధునాతన 5జీ సేవలకు గూగుల్క్లౌడ్తో జత కలిసిన ఇంటెల్
- బైక్‌ను ఢీకొట్టిన బొలెరో.. ఇద్దరు దుర్మరణం
- చిలీకి నౌకను నిర్మించిన భారత సంస్థ ఎల్ అండ్ టీ
- అనసూయను ఆశ్చర్యంలో ముంచేసిన అభిమాని
- రోహిత్ శర్మ అర్ధసెంచరీ
- తొలిరోజు పాఠశాలలకు 10 శాతంలోపే విద్యార్థులు
- టీఆర్ఎస్తోనే నిరంతర అభివృద్ధి : పల్లా రాజేశ్వర్ రెడ్డి
- గురువాయూర్‌లో ఏనుగులకు పరుగుపందెం