కావలసిన పదార్థాలు
బ్రకోలీ: ఒక కప్పు, మైదా: పావు కప్పు, కార్న్‌ఫ్లోర్: రెండు టేబుల్ స్పూన్లు, బియ్యపు పిండి: ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి తురుము: ఒక టీస్పూన్, సన్నగా తరిగిన అల్లం: ఒక టీస్పూన్, కరివేపాకు తరుగు: ఒక టీస్పూన్, మిరియాల పొడి: అర టీస్పూన్, గరం మసాలా: పావు టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కొద్దిగా
తయారీ విధానం
తరిగిన బ్రకోలీని రెండు నిమిషాలపాటు మరిగే నీళ్లలో వేసి వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, తరిగిన కొత్తిమీర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, కారం, గరం మసాలా, మిరియాల పొడి, ఉప్పు వేసి, నీళ్లుపోసి జారుగా కలుపుకోవాలి. స్టవ్‌మీద వేయించడానికి సరిపడా నూనెపెట్టి, బ్రకోలీ ముక్కలను పిండి మిశ్రమంలో వేసి వేయిస్తే కరకరలాడే బ్రకోలీ 65 రెడీ.