కావలసిన పదార్థాలు
బ్రకోలి: ఒకటి (చిన్నది), ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, మిరియాలు: ఒక టీస్పూన్, పచ్చికొబ్బరి తురుము: అర కప్పు, జీలకర్ర: ఒక టీస్పూన్, పసుపు: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, అల్లం: అంగుళం ముక్క.
తయారీ విధానం
మరుగుతున్న నీటిలో అర టీస్పూన్ ఉప్పు, తరిగిన బ్రకోలి వేసి మూడు నిమిషాలపాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో పచ్చికొబ్బరి తురుము, మిరియాలు, అల్లం వేసి మెత్తగా గ్రైండ్‌చేసి పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి, నూనె వేడయ్యాక జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక ఉడికించిన బ్రకోలి, పసుపు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. చివరగా కొబ్బరి మిశ్రమం వేసి కలుపుతూ, రెండు నిమిషాలపాటు సన్నని మంటపై వేయిస్తే బ్రకోలి పెప్పర్ ఫ్రై సిద్ధం.