ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Zindagi - Jan 22, 2021 , 00:12:22

పిల్లలున్నారా.. జాగ్రత్త!

పిల్లలున్నారా.. జాగ్రత్త!

పసిపిల్లల్లో ఉత్సుకత ఎక్కువ. అందుకే, చేయొద్దన్న పనే చేస్తుంటారు. ఒక్కచోట ఉండరు.  ఇల్లంతా కలియతిరుగుతూ దెబ్బలు తగిలించుకుంటారు.అనుక్షణం పిల్లల్ని కాచుకుని ఉండటం అంత సులభం కాదు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మేలు..

  • కొందరు పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతారు. బిడ్డ నీరసంగా కనబడినా, అకస్మాత్తుగా పడిపోయినా, వెంటనే శరీరంలో ఏదైనా మార్పు ఉందేమో గమనించాలి. ముక్కు, చెవి, నోటి నుండి రక్తం వచ్చినట్టు అనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి.
  • ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాకు, కత్తెర, బ్లేడు వంటి పదునైన వస్తువులను ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు. టేబుల్‌, కుర్చీల వంటి ఫర్నిచర్‌ చివర్లలో పదును ఎక్కువ. దీంతో, పరుగులు పెడుతున్నప్పుడు దెబ్బలు తగిలే ఆస్కారం ఉంది. రబ్బరు లేదా ప్లాస్టిక్‌తో వాటిని కవర్‌ చేయాలి.
  • పిల్లలు బొమ్మల్ని నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అందుకే చిన్నచిన్న బొమ్మలను ఇవ్వకూడదు. కొన్నిసార్లు ఆ ముక్కలు విడిపోయి గొంతుకు అడ్డం పడే ప్రమాదం ఉంది. విష పూరిత రసాయనాలతో చేసిన బొమ్మలు కొనకపోవడమే ఉత్తమం. 
  • ఇంట్లో వాడే డిటర్జెంట్లు, ఫ్లోర్‌ క్లీనర్లను పిల్లలకు అందనంత ఎత్తులో ఉంచాలి. ముఖ్యంగా వాటిని ఆహార పదార్థాల ప్యాకెట్లను పోలిన డబ్బాల్లో పెట్టినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున నోట్లో వేసుకుంటే వాంతులు, విరేచనాలు కావచ్చు. 

VIDEOS

logo