తెల్లజుట్టును మార్చేయండిలా!


Tue,December 10, 2019 12:28 AM

పాతికేళ్లు నిండకముందే జుట్టు తెల్లబడడం సాధారణమైంది. దీంతో యుక్తవయసులోనే పెద్దవాళ్లుగా కనిపిస్తున్నారు. ఈ సమస్యకు ఇంట్లోనే చక్కటి పరిష్కారం ఉంది.
white-Hair
-తెల్లజుట్టుకు రంగేయడమంటే వెంటనే గుర్తొచ్చేది హెన్నా. ఈ పౌడర్‌ను ఆముదంలో మరిగించాలి. చల్లబడ్డాక జుట్టు కుదుళ్లకు తాకేలా రాయాలి. రెండు గంటల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
-రెండు టేబుల్ స్పూన్ల కాఫీపొడిని కప్పు నీటిలో మరిగించాలి. చల్లారక జుట్టుకు పట్టించి మసాజ్ చేయాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.
-బ్లాక్ టీ పొడిని నీటిలో మరిగించి.. గోరువెచ్చగా అయ్యాక తలకు రాసుకోవాలి. ఓ గంట తర్వాత తలస్నానం చేయాలి.
-వాల్‌నట్లను నలిపి అరగంట సేపు నీటిలో మరిగించాలి. తర్వాత కాటన్‌బాల్ సాయంతో జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఓ గంట తర్వాత తలస్నానం చేయాలి.
-ఈ చిట్కాలన్నీ ఒక్కరోజులో చేస్తే సరిపోదూ.. దాదాపు ఓ నెలపాటు క్రమం తప్పకుండా వాడాలి. అప్పుడు మంచి ఫలితం ఉంటుంది.

681
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles