పట్టుబట్టలపై మరకలా?


Thu,December 5, 2019 12:42 AM

Pattu-battalu
-పట్టుబట్టల మీద కాఫీ లేదా టీ మరకలు పడితే కార్బన్ టెట్రాక్లోరైడ్‌ను పూస్తే మరకలు పోతాయి. అప్పటికీ పోకపోతే వేడి నీటిలో కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి ఆ నీటిలో ఉతకాలి. పట్టుబట్టల మీద చాక్లెట్ మరకలు పడితే వేడినీటిలో జాడించి ఉతికితే పోతాయి. పెరుగు, వెన్న వంటి మరకలు పడితే మరకపై ఒక చుక్క కార్బన్ టెట్రాక్లోరైడ్‌ను ఉపయోగించాలి.
-పట్టుబట్టల మీద ఇంక్ లేదా లిప్‌స్టిక్ మరకలు పడితే ఆ భాగంలో పేపర్ టవల్‌ను ఉంచి వెనుకనుంచి డ్రైక్లీనింగ్ ద్రావణం లేదా ఆల్కహాల్ పూయాలి. మరక పూర్తిగా పోయేవరకు నీటిని వాడరాదు. అదే నెయిల్ పాలిష్ పడితే ఆ భాగం వరకు అసిటోన్‌లో ముంచితే సరిపోతుంది.
-బురద మట్టి మరకలు పడితే పట్టువస్ర్తాన్ని ఆరనిచ్చి కార్బన్ టెట్రాక్లోరైడ్‌తో తుడిచి ఉతికితే సరిపోతుంది. షూ పాలిష్ మరకలు పడితే కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ వేసి రుద్ది ఆ తర్వాత ఆల్కహాల్ పూయాలి.
-పట్టుబట్టలను ప్లాస్టిక్ సంచుల్లో లేదా పేపర్, కాటన్ సంచుల్లోనే ఉంచాలి. పట్టుబట్టలున్న చోట ఎక్కువ గాలి, కాంతి లేకుండా చూడాలి. పట్టుబట్టలను చెక్క లేదా కలపతో చేసిన పెట్టె లేదా బీరువాలో నేరుగా తాకేలా కాకుండా కవరులో పెట్టి పెట్టాలి.
-పట్టుబట్టలను అప్పుడప్పుడు బయటకు తీసి గాలి సోకనీయాలి. లేకుంటే ముడతలు పడిన చోట చిరుగులు పడే అవకాశం ఉంది.

237
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles