వినూత్న ప్రచారం


Wed,December 4, 2019 12:54 AM

stanton-cook-australia
అర గడ్డం, అర మీసంతో రోడ్లపై తిరుగుతున్నాడో యువకుడు. అటుగా వెళ్తున్న కొందరు యువకులు గమనించారు. అతడి చుట్టూ చేరి హేళన చేశారు. అతడేం మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఉన్న అరమీసం, గడ్డం తీసేస్తామని బెదిరించారు. అతడు ఒక్కసారిగా నోరు తెరిచాడు. గొంతు పగిలేట్లుగా నినదించాడు. ఏంటా నినాదం? అరగడ్డం, అరమీసంతో ఎందుకు తిరుగుతున్నాడా యువకుడు?


ఓ యువకుడు అరగడ్డం, అర మీసంతో రోడ్లపై తిరుగుతున్నాడు. అతడిని చూసి కొందరు ఎగతాళి చేస్తున్నారు. మరికొందరు నవ్వుకుంటున్నారు. కొందరు ప్రశంసించి అతడితో ఫొటోలు దిగి సామాజిక మాద్యమాల్లో షేర్‌ చేస్తున్నారు. ఇంతకీ రోడ్లపై తిరుగుతున్న అతడు వార్తల్లోకి ఎక్కే పని ఏం చేశాడంటే.. అమేజాన్‌ అడవులు భూమికి 25 శాతం ఆక్సిజన్‌ను అందిస్తున్నాయి. అవి ఇటీవల అగ్నికి ఆహుతైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ మంటలను అదుపు చేయలేక బ్రెజిల్‌ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. దీంతో ప్రపంచంలోని పర్యావరణవేత్తలు, పర్యావరణ ప్రేమికులు తమ నిరసనలు వినిపిస్తూనే ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన స్టాంటన్‌ కూక్‌ అనే యువకుడు గతేడాది నుంచి జుట్టు, మీసాలను, గెడ్డాన్ని సగానికి తీసి ఆస్ట్రేలియా వీధుల్లో తిరుగుతున్నాడు. అడవులను రక్షించాలంటూ నినదిస్తున్నాడు. అవగాహన కల్పిస్తున్నాడు. అడవుల పరిరక్షణకు విరాళాలు సేకరిస్తున్నాడు. వాటిని అమేజాన్‌ అడవుల పరిరక్షణ కోసం పోరాడుతున్న ‘సేవింగ్‌ ఇండిగేనోస్‌ ల్యాండ్‌' అనే రెయిన్‌ ఫారెస్ట్‌ ట్రస్టుకు అందిస్తున్నాడు. అతన్ని చూడగానే చాలామంది కొత్త ైస్టెలేమో అనుకుంటారు. కొందరు ఎగతాళి చేస్తారు. కానీ అసలు విషయం తెలిసిన తర్వాత మాత్రం మెచ్చుకోకుండా ఉండరు.

397
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles