ముక్కులోంచి రక్తం కారుతున్నదా?


Wed,December 4, 2019 12:36 AM

కొందరికి తరచూ ముక్కుల్లోంచి రక్తం కారుతుంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ముక్కులోంచి రక్తం కారుతుంటే పెద్దగా టెన్షన్ పడాల్సిన పనేం లేదు. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.
bleeding
-మెడను మంచం అంచుకు చేర్చి తలను వెనక్కు వాల్చాలి. అప్పుడు రక్తం బయటకు పొంగి రాకుండా ఆగుతుంది. ఏ ముక్కు రంధ్రంలోంచి రక్తం కారుతుందో ఆ వైపున కంటికి కిందుగా మూక్కుదూలం మూలమీద గట్టిగా నొక్కి పట్టాలి. వెంటనే రక్తం కారడం ఆగుతుంది.
-దానిమ్మ పూలను దంచి, రసం తీసి ముక్కులో చుక్కలు వేయాలి. గరికగడ్డి వేళ్లను శుభ్రం చేసి, మెత్తగా దంచి ఆ రసాన్ని చుక్కలుగా వేసినా రక్తం ఆగుతుంది. ఎర్ర ఉల్లిపాయలు దంచి ఆ రసాన్ని ముక్కులో వేస్తే రక్తం ఆగుతుంది.
-పెద్ద సైజులో ఉండే ఉసిరి కాయలు తెచ్చి వాటిని మెత్తగా దంచి ఆ గుజ్జును తలకు పట్టిస్తే ఒంటికి చలువ ఏర్పడుతుంది. రక్తం కారడం ఆగిపోతుంది.
-అడ్డసరం పువ్వుల్ని మెత్తగా దంచి, నేతిలో వేయించి, పంచదార పాకం పట్టుకొని తేనె కలుపుకొని ఒకట్రెండు చెంచాల మోతాదులో రెండు పూటలా రోజూ తీసుకుంటే ముక్కులోంచి రక్తం కారడం ఆగుతుంది.
-ముందు తలను పైకి లేపాలి. మెత్తటి బట్టలో ఐస్ ముక్కలను చుట్టి ముక్కుపైన ఉంచాలి. ఇలా 4-5 నిమిషాల పాటు పెడుతూ తీస్తూ ఉంటే రక్తం కారడం ఆగుతుంది. ఈ విధానాన్ని రోజులో రెండు మూడు సార్లు ప్రయత్నిస్తే మంచిది. ఐస్ ముక్కల వల్ల కలిగే చల్లదనం రక్తం గడ్డకట్టే సమయాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా రక్తం కారడం త్వరగా ఆగిపోతుంది.

235
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles