కొత్త ఫీచర్లు


Wed,December 4, 2019 12:34 AM

wtsup
ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు వచ్చాయి. యూజర్ల అభిరుచికి తగ్గట్టు ఎప్పటికప్పుడూ ఫీచర్లు మారుస్తున్న సంగతి తెలిసింది. దీంట్లో భాగంగానే తాజాగా రెండిటిలో కొత్త ఫీచర్లు వచ్చాయి.


వాట్సాప్‌ : వాట్పాప్‌లో గ్రూప్స్‌ సాధారణం. స్నేహితులు, సహోద్యోగులు, కుటుంబీకులు ఇలా ఎవరి సర్కిల్‌తో వారు గ్రూపులు ఏర్పాటు చేసుకొంటారు. వాట్సాప్‌లో తాజా ఫీచర్‌ ఈ గ్రూపులకు సంబంధించినది. ఈ ఫీచర్‌ ద్వారా గ్రూప్‌లో పెట్టిన మెసేజ్‌ ఫలాన సమయానికి అది కనబడకుండా చేయవచ్చు. ఉదాహరణకు మీరు పెట్టిన మెసేజ్‌ గంట తర్వాత గ్రూప్‌లో ఉండొద్దు అంటే దానికి తగ్గట్టు టైంను సెట్‌ చేసుకొనే అవకాశం ఉంది. ‘డిసప్పియర్‌ మెసేజెస్‌' పేరుతో ఈ ఫీచర్‌ వాట్సాప్‌ బీటా వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో ఇది ఉంది. త్వరలోనే ఐఓఎస్‌ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది.
facebook
ఫేస్‌బుక్‌ : ఫేస్‌బుక్‌లో చాలా ఫొటోలు, వీడియోలు యూజర్లకు నచ్చుతాయి. అలా నచ్చిన ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసుకోవడం, వీడియోలను షేర్‌ చేసుకోవడం సాధారణం. అట్లాగే ఫేస్‌బుక్‌ మీడియాను బయటకు కూడా షేర్‌ చేసుకొనే అవకాశం ఉంది. ఇప్పుడు తాజా ఫీచర్‌ ద్వారా ఫేస్‌బుక్‌ ఫొటోలను, వీడియోలను నేరుగా గూగుల్‌ ఫొటోస్‌లో సేవ్‌ చేసుకోవచ్చు. ‘డేటా ట్రాన్స్‌ఫర్‌ ప్రాజెక్ట్‌ ’ పేరుతో ఫేస్‌బుక్‌ ఈ టూల్‌ను అందించనున్నది. ఐర్‌ల్యాండ్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్త యూజర్లకు అందుబాటులోకి రానుంది.

211
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles