బాగా నిద్రపోతారా? రూ.లక్ష గెలుచుకోండి!


Tue,December 3, 2019 12:36 AM

sleeping
ఆఫీసులో భోజనం చేయగానే కండ్లు మూతలుపడుతుంటాయి. తప్పని పరిస్థితిల్లో కండ్లు నలుపుకుంటూ పనిలో మునిగిపోతున్నారా? అయితే.. ఈ ఉద్యోగంలో చేరండి. రాత్రి 9 గంటలు నిద్రపోండి. 100 రోజులు. రూ. లక్ష గెలుచుకోండి. ఇది ఎక్కడంటే..


అబ్బా.. రోజంతా నిద్రపోయే జాబ్‌ ఉంటే ఎంతబాగుండు. జపాన్‌లో కాసేపు పడుకోవడానికి కూడా టైం ఇచ్చినట్లుగా మన ఆఫీసులో కూడా కొంచెం సేపు నిద్రపోండని చెబితే ఎంత బాగుండు. ఎప్పుడూ అనుకోవడమే గాని ఏనాడు ఏ యజమానీ చెప్పలేదు. ఇలా ఎవరో అనుకుంటున్న సమయంలో దేవతలు తథాస్తు అని ఉంటారు కాబోలు. బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్‌ సంస్థ ‘రండి నిద్రపోండి.. రూ. లక్ష అందుకోండి’ అంటూ ఉద్యోగం ఆఫర్‌ చేస్తున్నారు. దేవుడా..! అనుకోగానే దేవుడు వరం ప్రసాదించినట్లు ఉందీ ఉద్యోగం. రోజుకు ఎనిమిది గంటలే కాకుండా గొడ్డు చాకిరీ చేపించుకునే సంస్థలను చూశాం కాని ఇలా నిద్రపోయే ఆఫర్‌ ఎప్పుడూ చూడలేదంటున్నారు నెటిజన్లు. అంతేకాదు, ఈ ఉద్యోగంలో భాగంగా రోజూ రాత్రి 9 గంటలు నిద్రపోతే చాలు. అయితే 100 రోజులపాటు తప్పకుండా ఈ డ్యూటీ చేయాలంటున్నారు.

స్లీప్‌ ప్యాట్రన్స్‌పై స్టడీ చేస్తున్న పరుపుల కంపెనీ ‘వేక్‌ఫిట్‌' ఈ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ స్లీప్‌ ఆఫర్‌కు దేశంలో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు వెబ్‌సైట్‌ wakefit.co ను సంప్రదించండంటూ సంస్థ డైరెక్టర్‌ చైతన్య రామలింగ గౌడ చెబుతున్నారు. 100 రోజుల ఈ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాం కోసం అభ్యర్థులు ప్రత్యేకంగా ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరు ఎంత బాగా నిద్రపోగలరో వివరిస్తే చాలు. వారి ఇంటికే కంపెనీ మ్యాట్రెస్‌, స్లీప్‌ ట్రాక్స్‌ పంపుతారు. ఈ ఉద్యోగానికి ఎంపికయ్యే అభ్యర్థులు వారు నిద్రపోయే సమయాన్ని వీడియో తీసి పంపాలని డైరెక్టర్‌ తెలిపారు.

483
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles