జుట్టు కోసం మైదాకు


Thu,November 28, 2019 12:23 AM

జుట్టు సంరక్షణకు ఎన్ని ఉత్పత్తులు వాడినా ఫలితం ఉండదు. కొన్నిసార్లు వాటి ప్రభావం వల్ల జుట్టు మరింత రాలిపోతుంటుంది. ఈ సమస్యలన్నింటికీ ఒక్కటే పరిష్కారం మైదాకు.
Gorintaku
-జుట్టు రింగులుగా మారి ఇబ్బంది పెడుతుంటే గోరింటాకు, కోడిగుడ్లు, పెరుగు కలిపి పట్టిస్తే రింగులుగా మారడం తొలగిపోయి ఎంతో మృదువుగా అవుతుంది. గోరింటాకు చల్లదనాన్ని ఇస్తుంది. అందువల్ల జలుబు, జ్వరం, దగ్గు ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించవద్దు.
-చుండ్రు సమస్యను గోరింటాకు ద్వారా పరిష్కరించవచ్చు. జుట్టుకు బలాన్ని అందించే పోషకపదార్థాలను గోరింటాకు అందిస్తుంది. తలనొప్పి, నిద్రలేమి సమస్య నుంచి కూడా గోరింటాకు బయటపడేస్తుంది.
-గోరింటాకు రాసిన తర్వాత తడిగా ఉండడానికి కవర్‌ను చుట్టుకోవాలి. లేదంటే గోరింటాకు ఎండిపోయి శుభ్రపర్చడానికి వీలులేకుండా మారుతుంది. గోరింటాకును జుట్టుపై ఎక్కువ సేపు ఉంచడం వల్ల చిట్లిన జుట్టును అందంగా మార్చుకోవచ్చు.
-చుండ్రు కారణంగా కుదుళ్లలో దురద సాధారణం. అయితే వేప నూనెను రాత్రి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య తొలిగిపోతుంది. తలలోని చిన్న చిన్న కురుపుల సమస్య కూడా తొలిగిపోతుంది.
-వెంట్రుకలు రాలడం, చుండ్రు సమస్యను కలబంద తగ్గిస్తుంది. కలబంద జెల్‌ను జుట్టుపై రాసి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి 4 సార్లు చేయడం వల్ల ఫలితాల్ని పొందుతారు.

704
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles