పరుగుతోనే ఆయుఃప్రమాణం


Thu,November 28, 2019 12:21 AM

Running-Women
-హృద్రోగులు, క్యాన్సర్ బాధితులు వారానికి కనీసం 25 నిమిషాలు రన్నింగ్ చేస్తే ఆయుష్షును పెంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. రోజూ కొంత సమయం నడకకు కేటాయిస్తే శరీరంలో ఎండోర్ఫిన్స్ ఎక్కువగా విడుదలవుతాయి. ఫలితంగా స్ట్రెస్ తగ్గుతుంది. నడకవల్ల అల్జీమర్స్, డైమెన్షియా వంటి మతిమరుపు సమస్యలు రాకుండా ఉంటాయి.
-రోజూ కొంత సమయం పరుగుకు కేటాయిస్తే కంటి చూపు మెరుగవుతుంది. కంటిపై ఒత్తిడి తగ్గి చూపు కోల్పోయేందుకు కారణమయ్యే గ్లకోమాను అడ్డుకుంటుంది. పరిగెత్తడం వల్ల శరీరంలోని అన్ని భాగాలు కదులుతాయి. కంటికి కూడా మంచి వ్యాయామం దొరుకుతుంది.
-రోజూ కొంత సమయం పరుగుకు కేటాయించేవారికి ఎక్కువ శాతం గుండె నొప్పి, ఇతర జబ్బులు రావు. నడక వల్ల కూడా గుండెకు రక్త సరఫరా సక్రమంగా జరుగుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బీపీ అదుపులో ఉంటుంది. రోజూ నడవడం వల్ంల మరింత ఎక్కువ ఆక్సిజన్ శరీరానికి అందుతుంది.
-రోజూ గంట సేపు నడిచేవారికి గానీ, రోజూ అరగంట వ్యాయామం చేసేవారికి గానీ శరీరంలోని వ్యర్థాలు చెమట రూపంలో బయటకు పోతాయి. నడవడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.
-గ్లూకోజ్ లెవెల్స్ సరిగ్గా ఉండాలని భావిస్తే తరచూ నడిచే అలవాటు చేసుకోవాలి. డయాబెటిస్‌ను ఎదుర్కోవడానికి పరుగుకంటే నడకే మంచిది. మనం నడుస్తున్నప్పుడు మన పేగులు బాగా కదులుతాయి. దీంతో పేగులు క్రమ పద్ధతిలోకి వస్తాయి. అందువల్ల క్యాన్సర్ లాంటివి సోకకుండా ఉంటాయి. మలబద్దకం లాంటి సమస్యలు కూడా తొలిగిపోతాయి.

609
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles