చలికాలపు స్నాక్స్


Thu,November 21, 2019 12:55 AM

Food
శీతాకాలంలో పిల్లలు స్కూల్‌కు వెళ్లేటప్పుడు దుప్పటిలా మంచు కమ్మేసి ఉంటుంది. స్కూల్ నుంచి వచ్చేసరికి అప్పుడే చలి మొదలవుతుంటుంది. దీంతో చిన్నారులు చలికి వణికిపోకుండా వేడి వేడి స్నాక్స్ అందిస్తే.. వారి కడుపు నిండడంతోపాటు
శరీరం వెచ్చగానూ ఉంటుంది. సాయంత్రం వేళల్లో పిల్లలకు ఇష్టమైన స్నాక్స్‌ను తయారు చేసేందుకు కొన్ని ్ర పత్యేక వంటలను అందిస్తున్నాం.


చీజీగార్లిక్ టోస్ట్

mixes-veg-cheese-garlic

కావాల్సినవి :

బ్రెడ్ : 3
క్యారెట్ ముక్కలు : అరకప్పు
బీన్స్ ముక్కలు : పావు కప్పు
స్వీట్‌కార్న్ : పావుకప్పు
డిల్ లీవ్స్ : చిన్న కట్ట
బట్టర్ : 1 టేబుల్‌స్పూన్
జున్ను : పావు కప్పు
పీజాచీజ్ : 1 టీస్పూన్
వెల్లుల్లి ముక్కలు : అర టీస్పూన్
ఉప్పు : తగినంత.

తయారీ :

ముందుగా బ్రెడ్‌ను ముక్కలుగా చేసుకోవాలి. గిన్నె తీసుకొని అందులో క్యారెట్ ముక్కలు, బీన్స్, స్వీట్‌కార్న్, జున్న, పీజాచీజ్, డిల్ లీవ్స్ వేసి బాగా కలుపుకోవాలి. మరొక గిన్నెలో బట్టర్, వెల్లుల్లి, ఉప్పు వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని బ్రెడ్‌కు ఒకవైపు రాయాలి. ముందుగా కలిపి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ మిశ్రమాన్ని బట్టర్ రాసిన బ్రెడ్‌పై పెట్టాలి. బ్రెడ్ ముక్కలను ట్రేలో తీసుకొని ఓవెన్‌లో పెట్టుకోవాలి. 7 నిమిషాల తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. టమాట సాస్‌తో తింటే రుచిగా ఉంటుంది.

కార్న్ సర్వపిండి

sarva-pindi-with-corn

కావాల్సినవి :

కార్న్ : 1 కప్పు
అల్లం : చిన్నముక్క
జీలకర్ర : పావు టీస్పూన్
పచ్చిమిర్చి : 4
బియ్యంపిండి : పావు కప్పు
ఉల్లికాడల ముక్కలు : 1 కప్పు
కొత్తిమీర : 1 కట్ట
క్యారెట్ ముక్కలు : 2 టేబుల్‌స్పూన్లు
ఉల్లిగడ్డ ముక్కలు : 1 కప్పు
నూనె : సరిపడా
ఉప్పు : తగినంత.

తయారీ :

గట్టిగా ఉన్న మొక్కజొన్న విత్తనాలు, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చిని జార్‌లో వేసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమానికి బియ్యంపిండి, ఉప్పు, ఉల్లిముక్కలు, ఉల్లికాడలు, కొత్తిమీర, క్యారెట్ వేసి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత నాన్‌స్టిక్ పాన్‌లో కొంచెం నూనె వేయాలి. వేడి అయిన తర్వాత మిశ్రమం ముద్దను పాన్‌లో పెట్టి చేతితో చపాతీలా చేసుకోవాలి. దీనికి మధ్యలో రంధ్రాలు చేయాలి. సన్నని సెగపై ఉంచి 10 నిమిషాల తర్వాత వేడి వేడిగా ప్లేట్‌లో వేసుకొని తింటే.. కార్న్ సర్వపిండి రుచిని మెచ్చుకోకుండా ఉండలేరు.

గోబీ కాలీఫ్లవర్ 65

gobi-65

కావాల్సినవి :

కరివేపాకు : 2 రెబ్బలు, కొత్తిమీర : 1 కట్ట
ఎండుమిర్చి పేస్ట్ : 1 టీస్పూన్, పెప్పర్ పౌడర్ : అర టీస్పూన్, గరం మసాలా : అర టీస్పూన్, అల్లం
వెల్లుల్లి పేస్ట్ : అర టీస్పూన్, నూనె : సరిపడా, మైదాపిండి : 3 టీస్పూన్స్, మొక్కజొన్న పిండి : 4 స్పూన్స్, కాలీఫ్లవర్ : 1, ఉప్పు : తగినంత.

తయారీ :

వేడినీటిలో కాలీఫ్లవర్‌ను నిమిషంపాటు ఉంచి తీసేయాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకును కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో అల్లంవెల్లుల్లి పేస్ట్, గరంమసాలా, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చిపేస్ట్, పెప్పర్‌పౌడర్, మైదాపిండి, మొక్కజొన్న పిండి, కొంచెం నీరువేసి బాగా మిశ్రమంలా కలుపాలి. కడాయిలో నూనెపోసి వేడిచేయాలి. కాలీఫ్లవర్ ముక్కలను మిశ్రమంలో ముంచి నూనెలో వేసి రెండుసార్లు డీప్‌ఫ్రై చేయాలి. ఈ కమంలో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా డీప్‌ఫ్రై వేయాలి. తర్వాత ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటే గోబీ, కాలీఫ్లవర్ 65 రెడీ అయినట్లే.

అలూ చనాచాట్

allo-channa-chat

కావాల్సినవి :

పుదీనా ఆకులు : 2 టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర : చిన్నకట్ట, చాట్ మాసాలా : 1 టీస్పూన్, పచ్చిమిర్చి : 2, కారం : 1 టేబుల్‌స్పూన్, ఉల్లిగడ్డ : 1, కబూలి చనా : అరకప్పు, అలుగడ్డ లు: 2, నిమ్మరసం : 1 టీస్పూన్, స్వీట్ చింతపండు గుజ్జు : 2 టేబుల్‌స్పూన్లు, దానిమ్మగింజలు : 3 టేబుల్‌స్పూన్లు, జీలకర్ర : 1 టీస్పూన్, బట్టర్ : 1 టీస్పూన్, ఉప్పు : తగినంత.

తయారీ :

ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా కట్‌చేసి పెట్టుకోవాలి. ఆలుగడ్డలను ఉడికించి కట్ చేసుకోవాలి. కబులి చనా ఉడికించి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కారం, చాట్‌మసాలా పౌడర్, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో దానిమ్మగింజలు, కరిగించిన వెన్న, జీలకర్ర పౌడర్‌ను జోడించాలి. మిశ్రమాన్ని బాగా కలిపి టేస్ట్ చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.

-సంజయ్ తుమ్మ
-సెలబ్రిటీ చెఫ్

556
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles