అన్నదాతలకు విలువైన సమాచారం


Mon,November 11, 2019 01:10 AM

వ్యవసాయ విధానాలను అనుసరించి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాల్ని ఆర్జించే మెళకువలు చాలానే ఉన్నాయి. వాటిలో సాంప్రదాయ పద్ధతులతోపాటు, సరికొత్త వ్యవసాయ విధానాలు ఎంతో ఉపయోగకరం. అటువంటి విధానాలను తోటి రైతులతో పంచుకునేందుకు ముందుకు వచ్చారు కొంతమంది రైతులు. యూట్యూబ్ చానెల్‌ను వేదికగా చేసుకుని అన్నదాతలకు విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు.
Meghalaya
మేఘాలయకు చెందిన కొందరు రైతులు యూట్యూబ్ చానెల్‌ను వేదికగా చేసుకున్నారు. దాని ద్వారా అన్నదాతలకు అవసరమైన సలహాలూ, సూచనలు అందిస్తున్నారు. మేఘాలయలోని గ్రామీణ ప్రజలకు వ్యవసాయ సమాచారాన్ని అందించడంతోపాటు వారికి జీవనోపాధి కల్పించడానికి మేఘాలయ సర్కారు శ్రీకారం చుట్టింది. మేఘాలయ బేసిన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఎమ్‌బిడిఏ) ఆధ్వర్యంలో లైవ్లీవుడ్స్ అండ్ యాక్సెస్ టు మార్కెట్స్ ప్రాజెక్టు(లాంప్)పేరుతో ప్రత్యేకంగా పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు అవసరమైన సమాచారంతోపాటు వారు పండించిన పంటలను మార్కెటింగ్ చేసుకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నారు. లాంప్ ప్రాజెక్టుతో కలిసి పనిచేయడానికి యూట్యూబ్ చానెల్ ప్రారంభించిన రైతులు సిద్ధమయ్యారు. ప్రభుత్వం రాయితీలు, బ్యాంకు రుణాలు, ఇతర సదుపాయాలు అందిస్తున్నది. వాటి గురించి గ్రామీణ ప్రాంతాల వారికి అర్థమయ్యేలా స్థానిక యాస, భాషల్లోనే రైతులకు సమాచారం ఇస్తున్నారు.


నేటి తరంతో వ్యవసాయం అంతరించి పోయే ప్రమాదం ఉన్నది. అలా అంతరించిపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. అలాకాకుండా మరిన్ని తరాలకు ఈ వ్యవసాయ విధానాలు అందించాలనే ఉద్దేశంతో ఐదుగురు రైతులం కలిసి యూట్యూబ్ చానెల్ పెట్టాలనే ఆలోచన కలిగిందని మైడాలిస్ లింగ్డో అనే మహిళా రైతు చెబుతున్నది. మాకు తెలిసిన వ్యవసాయ సమాచారాన్ని యూట్యూబ్ చానెల్ ద్వారా పంచుకోవడం మొదలు పెట్టాం. మేమిచ్చే సమాచారంతో ఎంతోమంది యువతరం వ్యవసాయం చేయడానికి ముందుకువస్తున్నదని ఆమె అంటున్నది. ఆధునిక వ్యవసాయ విధానాలే కాకుండా సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులూ ఎంతో ప్రయోజనాలిస్తున్నాయి. మన పూర్వీకులు అనుసరించిన విధానాలూ మంచి ఫలసాయాన్ని ఆర్జించిపెట్టాయి. అటువంటి వాటి గురించి ఇప్పటి వరకూ మాకు తెలియలేదని ఓ యువరైతు చెబుతున్నాడు. ఈ యూట్యూబ్ చానెల్ ద్వారా కొత్తవిషయాలు తెలుసుకోగలిగామని అంటున్నాడు. స్టాబెర్రీ, కివీ, ద్రాక్ష వంటి పంటలు పండించి అధిక దిగుబడులను పొందుతున్నారు.

336
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles