మందుల్లేకుండా జ్వరం తగ్గుతుందా?


Mon,November 11, 2019 01:09 AM

పిల్లలు త్వరగా జబ్బు పడుతుంటారు. కారణం వారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. అయితే ఈ చిన్న చిట్కాలు పాటిస్తేచాలు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రెండు రోజులకు మించి జ్వరం తగ్గకపోతే మాత్రం తప్పనిసరిగా వైద్యుడికి చూపించాలి.
Fiver
-తరచూ జలుబు, జ్వరంతో బాధపడే పిల్లలకు ప్రతి రోజు ఉదయాన్నే చెంచాడు తేనెను ఇవ్వాలి. దీని వల్ల పిల్లలు జ్వరం, జలుబు సమస్య నుంచి బయటపడుతారు. పెద్దవారికి కూడా రోజూ పరిగడుపున చెంచాడు తేనెను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
-ఎక్కువ ద్రవ పదార్థాలను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. శరీర ఉష్ణోగ్రత వెంటనే తగ్గాలంటే శరీరానికి ఆలివ్ ఆయిల్ రాసి బాగా మసాజ్ చేయాలి. తర్వాత కాటన్ దుస్తులు ధరించి బాగా విశ్రాంతి తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వస్తుంది.
-వేడినీటితో గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల జ్వరంతో బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వస్తుంది. జ్వరంతో బాధపడుతున్నప్పుడు పిల్లల కాళ్లకు చల్లని నీటితో తడిపి పిండిన సాక్స్‌ను ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు.
-మెడ, తలపై వేడి ఎక్కువగా ఉన్నా ఒక పలుచటి వస్త్రాన్ని చల్లటి నీటిలో తడిపి నీరు లేకుండా పిండి తల, మెడ భాగాల్లో వేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు.

473
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles