రంగుల్లోని మర్మమేమిటి?


Mon,November 11, 2019 01:06 AM

ఇదివరకు ఇండ్లకు ఒకే కలర్ వేసేవారు. అది తెలుపు. కానీ ప్రస్తుతం ఎవరికి నచ్చిన రంగును వారు వేసు కుంటున్నారు. అయితే చాలామందికి రంగులు వ్యక్తీకరించే సందేశాలు తెలియవు. ఒక్కో రంగు ఒక్కో సందేశాన్నిస్తుంది. ఈసారి ఇంటికి రంగులేసే ముందు రంగులు చెప్పే సందేశాల గురించి తెలుసుకోండి.
Colors-of-Walls
తెలుపు: ఇండ్లకు తెలుపు రంగును మించిన రంగు మరోటి లేదు. అయితే ఎప్పుడూ ఒకే రంగు మనసుకు నచ్చదు. తెలుపు రంగుతో పాటు కొన్ని ఇతర కాంబినేషన్స్ ఉండేలా చూసుకోవాలి.
గ్రీన్‌కలర్: ఈ ప్రపంచంలో గ్రీన్ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. ఇండ్లలో గ్రీన్ కలర్ ఎంతో ఆహ్లాదాన్ని కల్గిస్తుంది. ప్రకృతిలో జీవిస్తున్న ఫీల్‌ను కలిగిస్తుంది. ముఖ్యంగా ఇంట్లోని స్టడీ రూంలో గ్రీన్ కలర్ ఎక్కువగాఉంటే పిల్లలు బాగా చదువుతారని పరిశోధకులు చెబుతున్నారు.
లేత నీలి రంగు: ఆకాశం బ్లూకలర్‌లో కనిపిస్తూ విశాలమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇండ్లకు బ్లూ కలర్ వేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. తలుపులు, కిటికీలకు ఈ కలర్ బాగుంటుంది.
ఎరుపు రంగు: ఈ రంగు ఎంత ఎక్కువగా ఉంటే టెన్షన్లు అంతలా పెరుగుతాయి. గది నిండా రెడ్ కలర్ ఉంటే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. కాబట్టి వీలైనంత తక్కువగా ఎరుపు రంగు ఉండేలా చూసుకోవాలి. ఈ కలర్ ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకని ఫ్రేములు, ర్యాక్స్, షెల్పులకు రెడ్ కలర్ వేసుకుంటే బాగుంటుంది.
గులాబీ రంగు: ప్రేమకు గుర్తుగా భావించే పింక్ కలర్ మనలో ప్రశాంతతను కలిగిస్తుంది. కోపం, ఆవేశాన్ని తగ్గిస్తుంది. ఇంట్లో పింక్ కలర్ ఉంటే బీపీ తగ్గడమే కాకుండా గుండె వేగం సక్రమంగా ఉంటుందట.
పసుపు రంగు: పసుపు రంగు బొద్దింకల్ని బాగా ఆకర్షిస్తుంది. అందువల్ల వీలైనంత వరకు ఇండ్ల్లల్లో గోడలకు పసుపు రంగు వాడొద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు.
నలుపు రంగు: లైటింగ్‌ను తగ్గించే శక్తి నలుపు రంగుకు ఉంటుంది. ఇంట్లో కాంతి బాగా ఉండాలంటే గోడలకు నలుపు రంగు వేయకపోవడమే మంచిది.
ఆరెంజ్ కలర్: ఆరెంజ్ కలర్ ఎనర్జీ లెవెల్స్‌ను పెంచుతుంది. ఉత్సాహాన్ని కలిగించి చురుకుదనాన్ని పెంచే లక్షణాలు ఆరెంజ్ కలర్‌లో ఉన్నాయి. ఎట్రాక్ట్ చేసే గుణం కూడా ఇందులో ఉంటుంది. ఇంటికి ఆరెంజ్ కలర్ వేసుకుంటే బాగానే ఉంటుంది.

276
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles